ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HOSPITAL WORKERS: సమస్యలు పరిష్కరించాలని కార్మికుల నిరసన

ABN, Publish Date - Aug 13 , 2024 | 12:08 AM

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా సర్వజన ఆస్పత్రి కార్మికులు ఆందోళన చేపట్టారు. బకాయి వేతనాలు చెల్లించాలని, జీఓప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని, ఈఎ్‌సఐ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ర్యాలీ చేపట్టారు.

Sanitation workers protesting at the hospital

అనంతపురం టౌన, ఆగస్టు 12: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా సర్వజన ఆస్పత్రి కార్మికులు ఆందోళన చేపట్టారు. బకాయి వేతనాలు చెల్లించాలని, జీఓప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని, ఈఎ్‌సఐ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. ఏఐటీయూసీ నాయకులు రాజారెడ్డి, రాజే్‌షగౌడు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కొన్నిరోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వులు మేరకు కనీస వేతనాలు చెల్లించకుండా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని మండిపడ్డారు. నాయకులు మనోహర్‌, వెంకటేష్‌, రామాంజనేయులు, భార్గవి, నారప్ప, ప్రశాంత పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2024 | 12:08 AM

Advertising
Advertising
<