POLL : ఓటరు స్లిప్పులో తప్పుగా పోలింగ్ కేంద్రం
ABN, Publish Date - May 14 , 2024 | 01:31 AM
మడకశిర మన్సిపాలిటీలోని నాలుగో వార్డులో ఉన్న చాలా మంది ఓటర్లకు పోలింగ్ కేంద్రం ఒక చోట, ఓటు మరోచోట ఉండడంతో ఓటువేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి ఓటరు స్లిప్పులో పోలింగ్ కేంద్రం ఎంఆర్‌ఎస్ స్కూల్ అనిఉంది. వాటితో ఉదయాన్నే ఎంఆర్‌ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం (193) వద్దకు వెళ్లి గంటల కొద్ది క్యూలో ఉన్నారు. అయితే పీఓ మీ ఓటు ఉర్దూస్కూల్(185) పోలింగ్ కేం ద్రంలో ఉందని చెప్పి పంపారు.
ఇబ్బందులు పడిన ఓటర్లు
మడకశిర రూరల్, మే 13 : మడకశిర మన్సిపాలిటీలోని నాలుగో వార్డులో ఉన్న చాలా మంది ఓటర్లకు పోలింగ్ కేంద్రం ఒక చోట, ఓటు మరోచోట ఉండడంతో ఓటువేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి ఓటరు స్లిప్పులో పోలింగ్ కేంద్రం ఎంఆర్‌ఎస్ స్కూల్ అనిఉంది. వాటితో ఉదయాన్నే ఎంఆర్‌ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం (193) వద్దకు వెళ్లి గంటల కొద్ది క్యూలో ఉన్నారు. అయితే పీఓ మీ ఓటు ఉర్దూస్కూల్(185) పోలింగ్ కేం ద్రంలో ఉందని చెప్పి పంపారు. ఓటర్ స్లిప్పులో వివరాలు సరిగాలేకపోవడంతో ఆ వార్డులోని చా మంది ఓటర్లు అనేక ఇబ్బందులు పడ్డారు.అధికారుల నిర్లక్ష్యం ఓటర్లుకు శాపంగా మారిందని ఆెేదన వ్యక్తంచేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 14 , 2024 | 01:31 AM