ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AMILINENI : కళ్యాణదుర్గంలో వైసీపీ పనైపోయింది

ABN, Publish Date - May 12 , 2024 | 12:02 AM

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ పనైపోయిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి, మోరేపల్లి, కొత్తూరు, కుర్లపల్లి, గరుడాపురం గ్రామాల్లో అశేష జనవాహిని మధ్య రోడ్డుషో నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు అమిలినేనికి పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.

రోడ్డుషోలో ప్రజలకు విక్టరీ గుర్తు చూపుతున్న అమిలినేని

కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం, మే 11: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ పనైపోయిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి, మోరేపల్లి, కొత్తూరు, కుర్లపల్లి, గరుడాపురం గ్రామాల్లో అశేష జనవాహిని మధ్య రోడ్డుషో నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు అమిలినేనికి పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో వైసీపీ ఖాళీ కాబోతోందని జోస్యం చెప్పారు. నియోజకవర్గంలో వచ్చేది టీడీపీనేనని ఇక మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, వాటన్నింటికి అడ్డుకట్ట వేసే రోజులు వచ్చాయన్నారు. 13వ తేదీన ఓటు అనే ఆయుధంతో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా వున్నారన్నారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో ప్రజలందరూ విసుగు చెందారని ఆ పార్టీకి బుద్దిచెప్పేందుకు సమయం వచ్చిందన్నారు. ఏ గ్రామంలో చూసినా వైసీపీని చీదరించుకునే స్థాయికి వచ్చిందంటే ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చునన్నారు.


నియోజకవర్గ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు టీడీపీకి జై కొడుతూ ముందుకొస్తున్నారన్నారు. నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తనకు ఒక్క చాన్స ఇవ్వాలని కోరారు. తనను గెలిపిస్తే అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపుతామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా పరిశ్రమలు స్థాపించి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. టీడీపీపై రోజురోజుకు అపూర్వ ఆదరణ పెరుగుతోందన్నారు. ఏ గ్రామంలో చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.


సూపర్‌సిక్స్‌ పథకాలు పేదలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. భావితరాల భవిష్యత్తు, కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వాలన్నా ఒక్క చంద్రబాబునాయుడు తోనే సాధ్యమవుతుందన్నారు. ప్రజలందరూ అభివృద్ధి దిశగా ఆలోచించాలని అప్పుడే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేందుకు అవకాశం వుంటుందన్నారు. ఓటు అనే ఆయుధంతో ఈ ఐదేళ్ల వైసీపీ పాలనకు స్వస్తి పలికి చంద్రబాబు పాలన కోరుకోవాలని విన్నవించారు. టీడీపీ హయాంలోనే మహిళలకు పెద్దపీట వేశామన్నారు. గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు పల్లె ప్రాంతాల్లో అధికంగా జీవిస్తున్నారని వారందరికీ సముచిత న్యాయం జరగాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యమవుతుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 12:02 AM

Advertising
Advertising