ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Assembly: స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో..

ABN, Publish Date - Jul 17 , 2024 | 08:20 PM

ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం ఏపీ అసెంబ్లీలోని గేట్-2ను ఆయన దగ్గరుండి తెరిపించారు.

AP Assembly speaker Ayyanna Patrudu

అమరావతి, జులై 17: ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం ఏపీ అసెంబ్లీలోని గేట్-2ను ఆయన దగ్గరుండి తెరిపించారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమని పేర్కొన్నారు. ఇది ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వమన్నారు.

Ambati Rambabu: పేరు మారినా ముద్రగడ.. ముద్రగడే


ఇది ప్రజా అసెంబ్లీ అంటూ ఏపీ అసెంబ్లీని ఆయన అభివర్ణించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధినేత, అప్పటి సీఎం వైఎస్ జగన్.. అమరావతి రైతులు తమకి జరిగిన అన్యాయానికి ప్రజాసామ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఆ సమయంలో అసెంబ్లీలోకి ఎవరూ రాకుండా గేటు-2 మూసి వేసి ప్రహరీ గోడను నిర్మించాలని నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాంతో ఆ గేట్‌కు అడ్డంగా ప్రహరీ గోడను నిర్మించారు.

Also Read:Madhya Pradesh: పాపం.. న్యాయం కోసం రైతు పొర్లు దండాలు


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దాంతో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నియమితులయ్యారు. ఆ క్రమంలో గేట్ 2కు అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేయాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు బుధవారం ఆదేశించారు. దాంతో ఆ ప్రహరీ గోడను కూల్చివేసి.. అసెంబ్లీ గేటు-2ను ఆయన తెరిపించారు.

Also Read: Bengaluru: రైతును అవమానించిన మాల్ సిబ్బంది

Also Read: Aadhaar number:‘ఆధార్ నెంబర్‌’ తో బ్యాంక్ ఖాతాలో సొమ్ము మాయం


ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్.. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపారు. అలాగే ప్రతిపక్ష నేతగా ఆయన పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలకు సైతం భారీగా హామీలు గుప్పించారు. ఆ క్రమంలో 2019 ఎన్నికల్లో ఆంధ్రా ఓటరు గంపగుత్తగా వైసీపీ ఓట్లు గుద్దారు. దీంతో ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ 151 స్థానాలకు కైవసం చేసుకుంది. దాంతో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. గద్దెనెక్కిన కొద్ది నెలలకే నవ్యాంధ్రకు మూడు రాజధానులుండాలంటూ సీఎం వైయస్ జగన్ కీలక ప్రకటన చేశారు.

Also Read: Uttar Pradesh: ఉప ఎన్నికల వేళ.. అగ్రనేతలు కీలక భేటీలు

Also Read: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అజిత్‌కి పెద్ద దెబ్బ


దాంతో రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. అందులోభాగంగా వారిని అణచివేసేందుకు నాటి జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. దీంతో అమరావతి రైతులు.. తమ సమస్యలు చెప్పుకొనేందుకు అసెంబ్లీకి సైతం వచ్చే అవకాశాలున్నాయని గత ప్రభుత్వం భావించింది. దాంతో ఏపీ అసెంబ్లీలోని గేట్ 2కు అడ్డంగా ప్రహరి గోడను నిర్మించింది. దానిని బుధవారం బద్దలు కొట్టారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 17 , 2024 | 08:33 PM

Advertising
Advertising
<