Minister Savitha : 26 జిల్లాల్లో బీసీ భవన్‌లు నిర్మిస్తాం
ABN, Publish Date - Nov 24 , 2024 | 04:18 AM
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో బీసీ భవన్‌లు నిర్మిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత చెప్పారు. ప్రస్తుతం ఉన్న బీసీ సంక్షేమ హాస్టళ్లు, బీసీ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చంద్రబాబు రూ.35కోట్లు కేటాయించారని వెల్లడించారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
కర్నూలులో ఘనంగా బీసీ శంఖారావం
కర్నూలు కల్చరల్, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 26 జిల్లాల్లో బీసీ భవన్‌లు నిర్మిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత చెప్పారు. ప్రస్తుతం ఉన్న బీసీ సంక్షేమ హాస్టళ్లు, బీసీ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చంద్రబాబు రూ.35కోట్లు కేటాయించారని వెల్లడించారు. శనివారం కర్నూలు జిల్లా కేంద్రంలో ‘బీసీ శంఖారావం’ కార్యక్రమం జరిగింది. మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో 13 బీసీ భవన్‌ల నిర్మాణాలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం తరఫున రూ.2కోట్లు గ్రాంటు మంజూరు చేశారని గుర్తు చేశారు. కొన్నిచోట్ల అవి 80 నుంచి 90 శాతం పూర్తయ్యాయన్నారు. జగన్ వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశాడని విమర్శించారు. బీసీ హాస్టళ్లు, రెసిడెన్సియల్ పాఠశాలలు అధ్వానంగా మారిపోయాయన్నారు. చంద్రబాబు దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లగా, 26 జిల్లాల్లో బీసీ భవన్‌లను పూర్తిచేయాలని సూచించినట్లు తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి రూ.2లక్షల కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీలు బస్తిపాటి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు యాదవ్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌ఎన్.బాలాజీ, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 24 , 2024 | 04:19 AM