Diwali 2024: దీపావళి ఎఫెక్ట్.. పూల ధరలకు రెక్కలు
ABN, Publish Date - Oct 29 , 2024 | 12:24 PM
దీపావళి పండుగ(Diwali festival) పూల రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది.రెండు రోజులుగా పూల ధరలకు రెక్కలు వచ్చాయి. సోమవారం వి.కోట పూల మార్కెట్‌లో కిలో బంతి పూలు గరిష్టంగా రూ. 40 వరకు పలకగా, కిలో చామంతి పూలు అత్యధికంగా రూ. 150 వరకు పలికాయి. బటన్ రోస్ కిలో రూ. 200 పలికింది. వి.కోటలో పూల వ్యాపారుల మధ్య పోటీ తలెత్తడంతో ధరలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.
- వి.కోట(అమరావతి): దీపావళి పండుగ(Diwali festival) పూల రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది.రెండు రోజులుగా పూల ధరలకు రెక్కలు వచ్చాయి. సోమవారం వి.కోట పూల మార్కెట్‌లో కిలో బంతి పూలు గరిష్టంగా రూ. 40 వరకు పలకగా, కిలో చామంతి పూలు అత్యధికంగా రూ. 150 వరకు పలికాయి. బటన్ రోస్ కిలో రూ. 200 పలికింది. వి.కోటలో పూల వ్యాపారుల మధ్య పోటీ తలెత్తడంతో ధరలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. వారం రోజుల క్రితం బంతి పూలు 30 కిలోల బస్తా రూ. 50 నుంచి వంద వరకు పలికేది. చామంతి కిలో రూ. 20 నుంచి 30 వరకు పలికేది.
ఈ వార్తను కూడా చదవండి: PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధు స్థల వివాదం
బటన్ రోస్ కిలో రూ. 80 వరకు మాత్రమే పలకగా, సోమవారానికి రెట్టింపు ధరలు పలకడంతో పూల రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. వి.కోట ప్రాంతంలో పండించే పూల నాణ్యత బాగుండడంతో పుణ్యక్షేత్రాల్లో మంచి గిరాకీ ఉంది. వి.కోట నుంచి తిరుపతి, హైదరాబాదు, శ్రీశైలం, విజయవాడ(Tirupati, Hyderabad, Srisailam, Vijayawada), రాజమండ్రి, మధురై, చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా(Chennai, Bangalore, Kolkata) తదితర ప్రాంతాల్లోని పుణ్య క్షేత్రాలకు పూలను ఎగుమతి చేస్తారు. దీపావళి సీజన్ కావడంతో పూలకు మరింత డిమాండు పెరిగింది.
వారం రోజుల ముందు కురిసిన వర్షాల వల్ల పూల తోటలు పూర్తిగా దెబ్బతిని దిగుబడులు తగ్గిపోయాయి. వ్యాపారుల మధ్య కొనుగోళ్ళకు పోటీ రావడంతో పూల ధరలు అమాంతం పెరిగాయి. రెండు రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులంటున్నారు. రెండు వారాల క్రితం వర్షాలతో పూలకు సరైన ధరలు లేకపోవడంతో కోతకోసిన పూలను రైతులు మార్కెట్‌కు తరలించినా అక్కడ కొనేవారు లేక రోడ్డు పక్కన పడేశారు. అదే నేడు పూల తోటల వద్దకే వ్యాపారులు తోటలను తమకే ఇవ్వాలం టూ క్యూకడుతున్నారని రైతులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ పట్టణం నుంచి ప్రధాన నగరం చూసినా పూల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీపావళి పండగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారి పూజకు చామంతి, గులాబీ ఇతర ఫ్లవర్స్ కంపల్సరీ. వినియోగదారులు విధిగా పూలు కొనుగోలు చేస్తారని కొనుగోలు దారులు ధరలు ఆమాంతం పెంచేశారు. ధరలు చూసి సామాన్యులు నోరెళ్ల బెట్టే పరిస్థితి. ధరల నియంత్రణపై పకడ్బందీ చర్యలు లేకపోవడంతో కొనుగోలు దారులు నష్టపోతున్నారు.
దీపావళి రోజున అమ్మవారిని పూజించడంతో పాటు ఇంటి గుమ్మానికి బంతిపూల దండ కడుతుంటారు. మరికొందరు షాపుల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తారు. గుమ్మానికి పూలతో రకరకాల డెకరేషన్ చేస్తుంటారు. లైటింగ్ ఏర్పాటు చేసి దగ దగ మెరిపిస్తారు. లక్ష్మీ అమ్మ వారు తమకు కరుణ, కటాక్షం ఇవ్వాలని వేడుకుంటారు. దీపావళి రోజున ఉదయం పూజ చేస్తారు. వ్యాపార సముదాయాల్లో సాయంత్రం పూట పూజ కార్యక్రమాలు ఉంటాయి.
ఈవార్తను కూడా చదవండి: Food Poisoning: వామ్మో.. మోమోస్!
ఈవార్తను కూడా చదవండి: KTR: బుచ్చమ్మది.. రేవంత్ చేసిన హత్య
ఈవార్తను కూడా చదవండి: Madhuranagar: ‘ధరణి’తో మా ప్లాట్ల కబ్జా
ఈవార్తను కూడా చదవండి: Kaleshwaram Project: మేడిగడ్డతో ముంపు
Read Latest Telangana News and National News
Updated Date - Oct 29 , 2024 | 01:07 PM