ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YVB Rajendraprasad: రేపు పంచాయితీరాజ్ సదస్సు.. ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరు

ABN, Publish Date - Jan 02 , 2024 | 09:57 AM

Andhrapradesh: రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు రేపు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరుగనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.

అమరావతి, జనవరి 2: రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు రేపు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరుగనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ (Panchayat Raj Chamber President YVB Rajendra Prasad) ప్రకటించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ సదస్సుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్‌ల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ సదస్సు జరగనుందని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్స్ పాల్గొనాలని రాజేంద్రప్రసాద్, లక్ష్మీ ముత్యాలరావుల పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల నిధులు, అధికారాలను దొంగిలించి రూ.3 కోట్ల 50 లక్షల గ్రామీణ ప్రజలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. అందుకే రాజకీయాలకతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఐక్యమై 16 డిమాండ్ల సాధన కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు వైవీబీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 02 , 2024 | 10:48 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising