ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏడుగురు కలెక్టర్లపై వేటు

ABN, Publish Date - Jun 23 , 2024 | 05:45 AM

రాష్ట్రప్రభుత్వం భారీఎత్తున కలెక్టర్లను బదిలీ చేసింది. జగన్‌ ప్రభుత్వంతో అంటకాగిన విశాఖపట్నం కలెక్టర్‌ మల్లికార్జున్‌, గుంటూరు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సహా ఏడుగురు కలెక్టర్లపై వేటుపడింది. వారికి పోస్టింగులు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టుచేయాలని ఆదేశిస్తూ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌

జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ఆదేశం

వీరిలో విశాఖ, తూర్పు, గుంటూరు కలెక్టర్లు

11 జిల్లాలకు కొత్తవారి నియామకం

గుంటూరుకు నాగలక్ష్మి, ఎన్టీఆర్‌కు సృజన

పశ్చిమకు సీనియర్‌ ఐఏఎస్‌ నాగరాణి

మొత్తం 6 జిల్లాలకు మహిళా కలెక్టర్లు

సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ఉత్తర్వులు

ఆర్థిక ముఖ్య కార్యదర్శిగా పీయూ్‌ష!

కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి

అమరావతి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం భారీఎత్తున కలెక్టర్లను బదిలీ చేసింది. జగన్‌ ప్రభుత్వంతో అంటకాగిన విశాఖపట్నం కలెక్టర్‌ మల్లికార్జున్‌, గుంటూరు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సహా ఏడుగురు కలెక్టర్లపై వేటుపడింది. వారికి పోస్టింగులు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టుచేయాలని ఆదేశిస్తూ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తంగా 11 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. వీరిలో ఆరుగురు మహిళలే కావడం విశేషం. గుంటూరు కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మి, ఏలూరు-కె.వెట్రిసెల్వి, తూర్పుగోదావరి-పి.ప్రశాంతి, పశ్చిమగోదావరి-సి.నాగరాణి, ఎన్టీఆర్‌ జిల్లా-సృజన, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ఎ.తమీమ్‌ అన్సారియాకు అవకాశం లభించింది. వీరిలో నాగరాణి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి. తొలిసారి కలెక్టర్‌ అయ్యారు. కాగా.. టీడీపీ కూటమి గెలిచిన వెంటనే పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో పాటు గుంటూరు కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు ఆయనతో భేటీకి ఆసక్తి చూపలేదు.


Updated Date - Jun 23 , 2024 | 05:45 AM

Advertising
Advertising