Share News

టీఎ్‌సఎప్‌సెట్‌లో ఏపీ టాపర్లు

ABN , Publish Date - May 19 , 2024 | 03:41 AM

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఎప్‌సెట్‌ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు.

టీఎ్‌సఎప్‌సెట్‌లో ఏపీ టాపర్లు

ఇంజనీరింగ్‌ టాపర్‌గా శ్రీకాకుళం విద్యార్థి

అగ్రికల్చర్‌-ఫార్మసీ టాపర్‌గా మదనపల్లి అమ్మాయి

టాప్‌-10లో ఐదుగురు ఏపీ విద్యార్థులే

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఎప్‌సెట్‌ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. రెండు విభాగాల్లో ఫస్ట్‌, సెకండ్‌ ర్యాంకులతోపాటు... టాప్‌-10లో ఐదుగురు ఏపీ విద్యార్థులే సాధించారు. ఇంజనీరింగ్‌లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత మొదటి ర్యాంకులు సాధించారు. రాష్ట్రంలోని సికింద్రాబాద్‌కు చెందిన రిషి శేఖర్‌ శుక్లా ఇంజనీరింగ్‌లో 3వ ర్యాంకు, హనుమకొండ జిల్లాకు చెందిన గడ్డం శ్రీవర్షిణి అగ్రి-ఫార్మసీలో 3వ ర్యాంకు సాధించారు. జేఎన్టీయూ క్యాంప్‌సలో శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ నర్సింహారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

రికార్డు సమయంలో ఫలితాల విడుదల

ఎప్‌సెట్‌ పరీక్షల ఫలితాలను రికార్డు సమయంలో (7 రోజుల్లోనే) విడుదల చేశామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వర్షం కారణంగా ఒకటి, రెండు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు మినహా.. ఎప్‌సెట్‌ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు.

ఐఐటీ ముంబైలో చేరతా

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించా. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదివాను. పదో తరగతిలో 556 మార్కులు, ఇంటర్‌లో 953 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా 116వ ర్యాంకు సాధించా. అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు తెచ్చుకొని ఐఐటీ ముంబైలో చేరతాను.

- సతివాడ జ్యోతిరాదిత్య, శ్రీకాకుళం జిల్లా,

ఇంజనీరింగ్‌ 1వ ర్యాంక్‌ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే...

జేఈఈ-మెయిన్స్‌ పరీక్ష ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 311వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా మంచి ర్యాంకు సాధించి ఐఐటీ ముంబై, ఐఐటీ చెన్నై వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో చేరాలన్నదే నా లక్ష్యం. ఉత్తమ ర్యాంకు రావడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు అధ్యాపకుల కృషే కారణం.

- గొల్ల లేఖ హర్ష, కర్నూలు,

ఇంజనీరింగ్‌ 2వ ర్యాంక్‌ కార్డియాక్‌ సర్జన్‌ అవుతా

మా నాన్న హోమియోపతి డాక్టర్‌గా సేవలందించడం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అప్పట్లోనే డాక్టర్‌ కావాలని అనుకున్నాను. కళాశాల అధ్యాపకుల సూచనలతో క్రమశిక్షణతో కూడిన చదువుతో ఫస్ట్‌ ర్యాంకు సాధించాను. సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు ఒక ప్రణాళికతో చదివాను. పాఠాలను అర్థం చేసుకుని, హోంవర్క్‌ చేస్తే మంచి మార్కులు వస్తాయి. నీట్‌ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో లేదా జిప్‌మర్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు సాఽధించి కార్డియాక్‌ సర్జన్‌ కావాలనుంది.

- అలూరు ప్రణీత, మదనపల్లె,

అగ్రికల్చర్‌-ఫార్మసీ 1వ ర్యాంక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా

పదో తరగతిలో 10/10 గ్రేడ్‌ సాధించా. ఇంటర్మీడియట్‌లో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో 252వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా మంచి ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో సీఎ్‌సఈలో చేరతా.

- భోగలపల్లి సందేశ్‌, ఆదోని,

ఇంజనీరింగ్‌ 4వ ర్యాంక్‌ సివిల్స్‌తో సేవ చేస్తా..

సివిల్‌ సర్వీసుకు ఎంపికై పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉంది. మా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలో 573 మార్కులు సాధించా. ఇంటర్‌లో 980 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో ఈడబ్లూఎస్‌ కేటగిరిలో 36వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. మంచి ర్యాంకు సాధించి అత్యుత్తమ విద్యాసంస్థలో బీటెక్‌లో సీఎ్‌సఈలో చేరాలని ఉంది.

- ముర్రసాని సాయి యశ్వంత్‌ రెడ్డి, కర్నూలు,

ఇంజనీరింగ్‌ 5వ ర్యాంక్‌

Updated Date - May 19 , 2024 | 03:42 AM