ఏపీలో పర్యాటక అభివృద్ధికి సహకరించండి
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:03 AM
దేశ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరినట్లు పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో టీడీపీ ఎంపీల భేటీ
న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): దేశ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరినట్లు పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు తెలిపారు. అరకు, లంబసింగితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి సహకరించాలని కోరామని చెప్పారు. శుక్రవారం ఇక్కడ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో రామ్మోహన్‌నాయుడితో పాటు టీడీపీ ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, శ్రీభరత్, నాగరాజు, హరీశ్ భేటీ అయ్యారు. గండికోట, రాజమండ్రిలోని హేవలాక్ వంతెన, పుష్కర ఘాట్ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల పట్ల ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిధుల కేటాయింపే నిదర్శనమన్నారు.
Updated Date - Nov 30 , 2024 | 04:03 AM