త్వరలో జిల్లా సహకార బ్యాంకు సీఈవోల నియామకం
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:57 PM
రాష్ట్రంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న సీఈవోల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న సీఈవోల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 13, 14 తేదీల్లో కర్నూలు, గుంటూరు, ప్రకాశం, ఏలూరు, అనంతపురం జిల్లాల సహకార కేంద్ర బ్యాంకుల సీఈవోల పోస్టులను భర్తీ చేసేందు కోసం ఆప్కాబ్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహించింది. కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈవోగా నియమించేందుకు ఇక్కడ పని చేస్తున్న నాగిరెడ్డి (డీజీఎం) ఇంటర్వ్యూకు హాజరైనట్లు తెలిసింది. మరో ముగ్గురుకి సీఈవోగా నియామకం పొందేందుకు అర్హత ఉన్నా.. వారికి ఆ పదవి ఇష్టం లేక ఇంటర్వ్యూకు హాజరు కాలేదు. రాజకీయ నేతల పడగ నీడలో సహకార కేంద్ర బ్యాంకు సీఈవోలుగా పని చేయడం అంటే కత్తిమీద సాములా ఉంటుందని వారు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
Updated Date - Nov 29 , 2024 | 11:57 PM