ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

APPSC: ఏపీపీఎస్సీ ఛైర్మన్ నియామకం.. ఎవరంటే

ABN, Publish Date - Oct 23 , 2024 | 03:48 PM

రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్‏ను బుధవారం నియమించింది. దీనికి ఛైర్మన్‏గా మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్‏ను బుధవారం నియమించింది. దీనికి ఛైర్మన్‏గా మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆమె ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో అనురాధను నియమిస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో టీడీపీ హయాంలో ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోం శాఖ కార్యదర్శిగా అనురాధ కీలక బాధ్యతలు నిర్వహించారు.


జల్లెడ పట్టి..

ఏపీపీఎస్సీ బాధ్యతల్ని గాడిన పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ పనిని సమర్థంగా, నిష్పాక్షికంగా నిర్వహించే అధికారుల కోసం జల్లెడ పట్టింది. ఈ మేరకు ఏపీ క్యాడర్‌కు చెందిన అనురాధను నియమించింది. ఏఆర్ అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్‌(IPS) అధికారిగా గుర్తింపు పొందారు. డీజీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కూడా ఆమె పనిచేశారు.

ఉమ్మడి ఏపీలో వివిధ జిల్లాలకుగానూ ఎస్పీగా, ఐజీగా పనిచేశారు. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. అనురాధ నియామకం పట్ల సానుకూలంగా ఉండటంతో ప్రభుత్వం ఆమెనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారం కోల్పోయాక ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని టీడీపీ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ప్రభుత్వం మారినా.. గౌతమ్ సవాంగ్ పదవీ కాలం మరో ఏడాదిపాటు గడువు ఉంది. అయినప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

For Latest News and National News Click here

Updated Date - Oct 23 , 2024 | 04:19 PM