చంద్రబాబును భగవంతుడితో పోల్చుతున్నాడేమో?!
ABN, Publish Date - Sep 16 , 2024 | 03:16 AM
ప్రకృతి వైపరీత్యాలన్నీ గాడ్ మేడే.. మేన్ మేడ్ వరదలు ఎవరూ క్రియేట్ చేయలేడు..
ప్రకృతి వైపరీత్యాలన్నీ గాడ్ మేడే.. మేన్ మేడ్ ఉండదు
జగన్‌ను ఉద్దేశించి ఉండి ఎమ్మెల్యే రఘురామ సెటైర్లు
రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు 15: ‘ప్రకృతి వైపరీత్యాలన్నీ గాడ్ మేడే.. మేన్ మేడ్ వరదలు ఎవరూ క్రియేట్ చేయలేడు.. అది తెలియకుండా చంద్రబాబు వల్లే వరదలు వచ్చాయంటూ జగన్ అంటున్నారంటే, ఆయన మా సీఎం చంద్రబాబును భగవంతుడితో పోల్చుతున్నాడేమో అని అనుకుంటున్నా’ అని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ ‘జగన్ ముఖ్యమంత్రి హోదాలో మిస్‌యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టే.. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని ఆరోజు కోర్టును ఆశ్రయించాను. ఇప్పుడు పదవి పాయే. ఆ రీజన్ చెల్లదు. స్పీడప్ అవ్వాలని మరో పిటిషన్ ఉంది. అది స్పీడప్ అవుతుందని చూస్తున్నా’ అని పేర్కొన్నారు. ‘యుద్ధం అయిపోయింది, జగన్ ఓడిపోయాడు. ఇప్పుడింక పోరాటం ఏముంది? ఎన్నికల వరకే పోరాటం. పోరాడాం. జగన్ దారుణంగా ఓడిపోయారు. ఇంక పోరాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నీ ఊడగొట్టుకుని అతిగా ఆవేశపడుతున్నాడు. జైలులో ఉన్న తన తోటి క్రిమినల్స్‌ను జాగ్రత్తగా చూసుకోవడాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు’ అంటూ రఘురామ ఎద్దేవా చేశారు.
Updated Date - Sep 16 , 2024 | 03:16 AM