ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుబజార్ల విస్తరణకు ఏర్పాట్లు

ABN, Publish Date - Dec 08 , 2024 | 11:22 PM

తెలుగుదేశం ప్రభుత్వం గతంలో రైతుబజార్లను ఏర్పాటు చేసింది. రైతుబజార్ల అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి.

కల్లూరులో పది రోజుల్లో ప్రారంభం

కర్నూలు అగ్రికల్చర్‌, (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం ప్రభుత్వం గతంలో రైతుబజార్లను ఏర్పాటు చేసింది. రైతుబజార్ల అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. సీక్యాంపు రైతుబజారులో కూరగాయల కొనుగోలుకు ప్రతి రోజూ దాదాపు నగరంలోని నలుమూలల నుంచి ఏడు వేల మంది వినియోగదారులు వస్తున్నారు. దాదాపు 20 వేల క్వింటాళ్ల దాకా కూరగాయలు అమ్ముడుపోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని రైతుబజార్లలో కర్నూలు సీ క్యాంపు రైతుబజారు ప్రథమ స్థానంలో ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే.. నగరంలోని కొత్తపేట, అమీన అబ్బాస్‌నగర్‌ రైతుబజార్లు మాత్రం ఇటు రైతులకు, అటు ప్రజలకు అరకొరగానే సేవలు అందిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు రైతుబజార్లను పైలట్‌ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ రైతుబజార్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఉన్న రైతుబజార్లను ఏ మాత్రం పట్టించుకోకపోగా కొత్తగా మరి కొన్ని రైతుబజార్లను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనను సమాధి చేసింది. అయితే.. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో కూరగాయలు పండిస్తున్న రైతులతోపాటు ప్రజల్లో ఆశలు చిగురించాయి.

ఫ విస్తరణ షురూ:

సీ క్యాంపు రైతుబజారులో ఆర్‌అండ్‌బీకి సంబంధించిన పది శిథిలావస్థకు చేరిన భవనాలను రైతుబజార్‌ విస్తరణ కోసం కేటాయించారు. గతంలోనే ఈ భవనాలను కూల్చివేసి సీ క్యాంపు రైతుబజారును విస్తరించేందుకు రూ.4.50 కోట్లు మంజూరు చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో రైతుబజార్‌ విస్తరణ పనులు అటకెక్కాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఈ బిల్డింగులను కూల్చివేసి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అడుగులు పడ్డాయి. ఇటీవలె మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ విజయ సునీత విస్తరణకు సంబంధించిన ప్రాంతాన్ని సందర్శించారు. వెంటనే ప్రతిపాదనలు పంపాలని, నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పంపారు. అదేవిధంగా కొత్తపేట రైతుబజారులో షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మించడంతోపాటు రైతుబజారును విస్తరించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. అమీన అబ్బాస్‌నగర్‌ రైతుబజారులో కూడా అవసరమైన షాపులు, ఖాళీ ప్రదేశాలు ఉండటం వల్ల రైతుబజారు ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు తెలిపాయి. ఆదోనిలో రైతుబజారు విస్తరణకు అవసరమైన ప్రతిపాదనలు చేస్తున్నామని, గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పించి దళారుల చేతుల్లో మోసపోకుండా కూరగాయలను రైతుబజారులోనే అమ్ముకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

రైతుబజార్లను విస్తరిస్తాం - నారాయణమూర్తి, ఏడీఎం:

ప్రస్తుతం ఉన్న రైతుబజార్లను విస్తరించి రైతులకు గిట్టుబాటు ధర అందించడంతోపాటు ప్రజలకు నాణ్యమైన చౌక ధరకు కూరగాయలను అందించేందు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. రైతుబజారును విస్తరించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.2.50 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. మరో పది రోజుల్లోని కల్లూరులోని గోవర్ధన రైతుబజార్‌ను పూర్తిగా రైతులకు అందుబాటులోకి తెస్తాం.

Updated Date - Dec 08 , 2024 | 11:22 PM