ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: రాజు గారు సామాన్యుడిలా..ఫ్యామిలీతో కలిసి రైలు ప్రయాణం

ABN, Publish Date - Jan 11 , 2024 | 12:57 PM

రాజవంశీయులంటే విలాసవంతమైన జీవితే గుర్తొస్తుంది. అందులోనూ కేంద్ర మంత్రిగా పనిచేస్తే మరింత లగ్జరీగా జీవితం గడుపుతారని అందరూ భావిస్తారు. కానీ అందుకు భిన్నంగా గడుపుతుంటారు రాజవంశీయుడు, సీనియర్ పొలిటీషన్ ఒకప్పటి కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు.

రాజ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి, గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా కూడా పనిచేశారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన చాలా సాధారణంగా ప్రజలతో కలిసి జీవిస్తున్నారు. ఆయన గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేయడం విశేషం. అయితే ఆయన ఎవరో కాదు తెలుగు రాష్ట్రాల్లోని ఏపీ విజయనగరం రాజ కుటుంబం నుంచి వచ్చిన అశోక్ గజపతి రాజు(Ashok Gajapathi Raju). తాజాగా ఆయన తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో అతనికి సంబంధించిన చిత్రాలను ఓ వ్యక్తి క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Kesineni Chinni: లక్షన్నర మెజారిటీతో గెలిపిస్తా..

ఆ ఫోటోలో 72 ఏళ్ల రాజు నీలిరంగు జాకెట్ ధరించి, తన కుటుంబంతో కూర్చుని రైలు కోసం వేచి ఉన్నారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడైన కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతిరాజు నిరాడంబర జీవితం గడపడం పట్ల నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు(comments) చేస్తున్నారు. రాజు సింప్లిసిటీకి ఇది నిదర్శమని ఓ వ్యక్తి ప్రశంసించారు. ఆయన ఎటువంటి భద్రత లేకుండా విజయనగరం వీధుల్లో తిరగడం నేను చుశానని మరోక వ్యక్తి కామెంట్ చేశారు. రాజ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆయన ప్రజా జీవితంలో నిజాయితీగా ఉంటారని ఇంకొక వ్యక్తి వ్యాఖ్యానించారు. ఆయన తల్చుకుంటే ఫ్లైట్‌లో కూడా వెళ్లవచ్చు. కానీ సాధారణంగా ప్రజలతో కలిసి వెళ్లడం గ్రేట్ అని ఇంకొంత మంది అంటున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రాలు చూసిన అనేక మంది రాజును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

అంతేకాదు ఈ చిత్రాన్ని టీడీపీ(TDP) తన సోషల్ మీడియా విభాగమైన ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా..ఈ పోస్ట్‌ను షేర్ చేసినప్పటి నుంచి లక్షా 35 వేల మందికి పైగా ప్రజలు దీన్ని వీక్షించారు. అంతేకాదు 4727 మందికిపైగా లైక్ చేసి అనేక మంది రీట్వీట్లు కూడా చేస్తున్నారు. అయితే గజపతి రాజు గతంలో 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాజు 1983లో తొలిసారిగా కేబినెట్‌ మంత్రి అయ్యారు. దీని తర్వాత 2004 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల పోర్ట్‌ఫోలియోను ఆయన నిర్వహించారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ 2018 మార్చిలో రాజీనామా చేశారు. ప్రస్తుతం గజపతిరాజు విజయనగరంలోని గజపతుల బంగ్లాలో నివసిస్తున్నారు.

Updated Date - Jan 11 , 2024 | 02:31 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising