ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరమ శ్రేయస్సును వర్షిస్తున్న శ్రీనివాస్ గ్రంధాలు: అశోక్ కుమార్ జైన్

ABN, Publish Date - Jul 13 , 2024 | 11:18 PM

ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్ గ్రంధాన్నిశనివారం సాయంకాలం రాజమహేంద్రవరం శ్రీ ఉమామార్కండేయస్వామి ఆలయంలో కోస్తా జిల్లాల వర్తక సంఘాల సమాఖ్య పూర్వ కార్యదర్శి, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ ఆవిష్కరించారు.

రాజమహేంద్రవరం, జూలై 13: ఇటు జంటనగరాల బోనాల ఉత్సవాల్లోను, అటు బెజవాడ కనకదుర్గమ్మ ఆషాఢ ఉత్సవాలలోను, మరొక వైపు చెన్నయ్ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ లోనూ ఒకే ఒక దివ్య గ్రంధం ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామ స్తోత్రమ్’ రెండు రోజుల్లో మూడు చోట్ల ఆవిష్కరణలు జరుపుకుని భక్త జనసముద్రం అభినందనలతో అనేక దేవాలయాల, ధార్మిక మండళ్ల, మఠాల, పీఠాల అర్చక, వేదపండిత, ధర్మకర్తలని విశేషంగా ఆకట్టుకుంటోంది.

ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్ గ్రంధాన్నిశనివారం సాయంకాలం రాజమహేంద్రవరం శ్రీ ఉమామార్కండేయస్వామి ఆలయంలో కోస్తా జిల్లాల వర్తక సంఘాల సమాఖ్య పూర్వ కార్యదర్శి, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ వేద పురాణేతి కావ్యాల్లోని ఉత్తమశ్రేణికి చెందిన దివ్య మంత్రాలే ఈ మంగళ గ్రంధంలో ఉత్తమ గురువులా దర్శనమిస్తున్నాయని పేర్కొంటూ మానవజీవితంలో ఏ మతం వారైనా ‘భగవద్భక్తి, ధర్మచింతన, కర్తవ్య నిర్వహణ’ మరువకూడదని చెప్పారు.

పరమ శ్రేయస్సును వర్షించే ధార్మిక గ్రంధాల రచనల్లో, సంకలనాల్లో, ప్రచురణలో, వితరణల్లో పురాణపండ శ్రీనివాస్ వెనుక దైవబలం కారుణ్యమై పొంగులెత్తుతోందని అశోక్ కుమార్ జైన్.. శ్రీనివాస్ కృషిని, ప్రతిభను అభినందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఉమామార్కండేయస్వామి ఆలయం అర్చకులు, సిబ్బంది తదితరులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనగా, నిత్యం ‘హరే కృష్ణ’ నామస్మరణతో తరిస్తున్న స్టాండర్డ్ ఎలెక్ట్రానిక్స్ సంస్థ డైరెక్టర్ చెన్నాప్రగడ శ్రీనివాస్ పర్యవేక్షణలో భక్తులకు ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామ స్తోత్రమ్’ గ్రంధాలను ఉచితంగా పంచడం విశేషం.

Updated Date - Jul 13 , 2024 | 11:41 PM

Advertising
Advertising
<