ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rajadhani Files: రాజధాని ఫైల్స్ సినిమాకు రివ్యూ ఇచ్చిన అచ్చెన్నాయుడు

ABN, Publish Date - Feb 16 , 2024 | 01:17 PM

‘రాజధాని ఫైల్స్’ సందేశాత్మకమైన సినిమా అని రాష్ట్ర హితం కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేడు ఆయన రాజధాని ఫైల్స్ చూసిన అనంతరం తన రివ్యూ ఇచ్చారు. సినిమా తీసిన విధానంపై ఆయన ప్రశంసలు కురింపించారు. సినిమా ముగింపు చిత్రానికి హైలైట్ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

అమరావతి: ‘రాజధాని ఫైల్స్’ సందేశాత్మకమైన సినిమా అని రాష్ట్ర హితం కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేడు ఆయన రాజధాని ఫైల్స్ చూసిన అనంతరం తన రివ్యూ ఇచ్చారు. సినిమా తీసిన విధానంపై ఆయన ప్రశంసలు కురింపించారు. సినిమా ముగింపు చిత్రానికి హైలైట్ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న యదార్ధ సంఘటనల్ని, అమరావతి కోసం 1500 రోజుల పైగా అలుపెరుగని పోరాటాన్ని చేస్తున్న ఉద్యమ నేపథ్యాన్ని, కేవలం 150 నిముషాల వ్యవధిలో అది కూడ సహజ సిద్ధంగా చిత్రీకరించటం నిజంగా అభినందనీయమన్నారు. ఎక్కడా అతి అనిపించకుండా, ఆ పాత్రల్లో ఏదో ఒక పాత్రను మనకు అన్వయించుకునేలా చేయగలగడం, అలాగే సందేశాత్మకంగా ఉండే ఒక అర్థవంతమైన ముగింపు ఈ చిత్రానికి హైలైట్ అని పేర్కొన్నారు. ఆమరావతి ఉద్యమానికి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు మనం నిజంగా ఏదైనా చేయాలనుకుంటే, మనం అందరం ముందుగా ఈ సినిమాని చూడాలని.. అలాగే చూసేలా మరో పది మందిని ప్రోత్సహించాలని అచ్చెన్నాయుడు తెలిపారు. కనీసం కొంత మందికైనా ఈ చిత్రం ద్వారా కనువిప్పు కలిగించిన వాళ్ళమవుతామని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 01:19 PM

Advertising
Advertising