ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విశాఖపట్నంలో యాక్సిస్ బ్యాంక్ పరిశుభ్రత మరియు చెట్ల పెంపకం డ్రైవ్

ABN, Publish Date - Jun 10 , 2024 | 11:46 PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 సందర్భంగా భారతదేశపు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ విశాఖపట్నంలోని కైలాసగిరి కొండ మరియు రుషికొండ బీచ్ వద్ద ‘ఓపెన్ ఫర్ ది ప్లానెట్ క్లీనథాన్’ పేరిట పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించింది.

వైజాగ్, జూన్ 10: ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 సందర్భంగా భారతదేశపు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ విశాఖపట్నంలోని కైలాసగిరి కొండ మరియు రుషికొండ బీచ్ వద్ద ‘ఓపెన్ ఫర్ ది ప్లానెట్ క్లీనథాన్’ పేరిట పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించింది. బ్యాంకు యొక్క బ్రాంచీ ఉద్యోగులు, స్థానిక కమ్యూనిటీలు, పర్యావరణ యాక్టివిస్టులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, స్థానిక అధికారులతో పాటు 400కి పైచిలుకు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సదరు పర్యాటక ప్రాంతం నుంచి 975 కేజీల వ్యర్ధాలను సేకరించారు. కైలాసగిరి హిల్స్‌లో ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ కూడా నిర్వహించబడింది, ఇందులో 200పైగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత ప్రాధాన్యత గురించి స్థానికులకు వాలంటీర్లు అవగాహన కల్పించారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ & రిటైర్డ్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వివి లక్ష్మీనారాయణ, విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి. రామ్ నరేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బ్యాంక్ చేపట్టిన ‘ఓపెన్ ఫర్ ది ప్లానెట్ క్లీనథాన్’ కార్యక్రమం భారతదేశవ్యాప్తంగా ముంబై, పుణె, వారణాసి, న్యూఢిల్లీ, గువాహటి, విశాఖపట్నం మరియు హైదరాబాద్ నగరాలు సహా పర్యాటకులు అత్యధికంగా సందర్శించే 20 పైచిలుకు ప్రాంతాల్లో జూన్ 5 నుంచి 12 వరకు ఉంటుంది. “మన భూమి (Our land).. మన భవిష్యత్తు (Our future).. మనం Generation Restoration” అంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 కోసం ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన థీమ్‌కి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని బ్యాంకు నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ మరియు హెడ్ Ms. ఆర్నికా దీక్షిత్ మాట్లాడుతూ.. “మన భూగ్రహాన్ని కాపాడుకోవడమనేది మనలో ప్రతి ఒక్కరి బాధ్యత అని యాక్సిస్ బ్యాంక్ విశ్వసిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా తోటి పౌరుల్లో పర్యావరణంపై అవగాహన, బాధ్యతను పెంపొందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. భవిష్యత్తును పరిరక్షించుకునేందుకు మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి కొత్త తరానికి తెలియజేసేందుకు ఈ సమష్టి కృషి తోడ్పడగలదని మేము ఆశిస్తున్నాం” అని తెలిపారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 11:47 PM

Advertising
Advertising