సోషల్ సైకోలపై ఏంచేద్దాం?
ABN, Publish Date - Nov 08 , 2024 | 04:42 AM
రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వారి నమ్మకం వమ్ముకాకుండా పలుపాలసీలు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిర్ణయించారు.
సోషల్ పోస్టుల కట్టడిపై బాబు, పవన్ చర్చ
కలిసి భోజనం.. గంటపాటు సంభాషణ
మహిళలపై పోస్టులు పెడితే.. సప్తసముద్రాల ఆవల ఉన్నా వదలం ప్రత్యేక చట్టం తెస్తాం..
నేరస్థులు భయపడిచచ్చేలా చేస్తాం: హోంమంత్రి అనిత
అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వారి నమ్మకం వమ్ముకాకుండా పలుపాలసీలు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిర్ణయించారు. గురువారం సచివాలయంలో మధ్యాహ్నం ఒక గంటపాటు పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. మధ్యాహ్నం ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ పలు సూచనలు చేయగా, సీఎం ఆసక్తిగా విన్నారు. ఇటీవలి సోషల్ మీడియా అశ్లీల పోస్టుల వ్యవహారం మరోసారి వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. దీనిపై ఏం చేయదలుచుకున్నారని పవన్ అడగగా, ఎలా చేస్తే సోషల్ మీడియాలో ఆగడాలను అరికట్టగలమో సూచనలు చేయాలని సీఎం కోరారు. రాష్ట్రంలో కొత్తగా కొన్ని పాలసీలను తీసుకురావాలని, కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని, ఎలాంటి పాలసీలు తీసుకురావాలన్న విషయంపై మీరు కూడా ఆలోచించండంటూ పవన్‌కు సూచించారు. నామినేటెడ్ పోస్టుల విషయంపై కూడా కొంతసేపు ఇద్దరి మధ్య సంభాషణ సాగింది. నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్న నేపఽథ్యంలో... వాటిలో ఏ పోస్టులు కావాలో చెప్పాలని, ఎవరికి ఇవ్వాలో పేర్లు కూడా సూచించాలని సీఎం ....పవన్‌తో అన్నట్లు సమాచారం. దీనిపై పార్టీ నేతలతో చర్చించి జాబితా ఇస్తామని పవన్ తెలిపినట్లు తెలిసింది.
Updated Date - Nov 08 , 2024 | 04:42 AM