ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

డ్రామాలు నమ్మరు!

ABN, Publish Date - Apr 18 , 2024 | 03:54 AM

ఓట్ల కోసమే సీఎం జగన్‌ గులకరాయి డ్రామా ఆడుతున్నాడని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఆయన డ్రామాలను జనం నమ్మే రోజులు పోయాయన్నారు. ప్రజాగళంలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా

ఓటమి భయంతోనే గులకరాయి నాటకం.. జగన్‌పై బాబు, పవన్‌ ఫైర్‌

ఓట్ల కోసం శవాలతో వస్తున్నాడు.. నిన్నటి వరకు బాబాయి

గొడ్డలి పోటు, కోడి కత్తి.. నేడేమో గులకరాయి డ్రామా

సర్వేలన్నీ మా కూటమికి అనుకూలం.. అందుకే జగన్‌ డ్రామాలు

జనం నమ్మే రోజులు పోయాయి.. నవరత్నాల పేరిట నవమోసాలు

మేమొస్తే రామరాజ్యం.. చేనేతలకు ఉచితంగా 200 యూనిట్లు

మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు.. మత్స్యకారుల పొట్టకొట్టే జీవో 217 రద్దు

శ్రీరామనవమి రోజు హామీ ఇస్తున్నా.. జగనాసుర వధ చేయండి.. బాబు పిలుపు

నా సంగతి సరే.. నువ్వెందుకు ఎమ్మెల్యేలను మార్చావ్‌?.. సీఎంపై పవన్‌ ధ్వజం

పెడన, బందరులో ఉమ్మడిగా ప్రజాగళం

మచిలీపట్నం/పెడన, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఓట్ల కోసమే సీఎం జగన్‌ గులకరాయి డ్రామా ఆడుతున్నాడని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఆయన డ్రామాలను జనం నమ్మే రోజులు పోయాయన్నారు. ప్రజాగళంలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా పెడన, మచిలీపట్నంలో జరిగిన ఉమ్మడి బహిరంగ సభల్లో వారు ప్రసంగించారు. పవన్‌ కల్యాణ్‌ ప్రజా జీవితంలో కూడా హీరోగా నిరూపించుకొన్న వ్యక్తి అని చంద్రబాబు ప్రశంసించారు. బాబాయిని గొడ్డలితో హత్య చేసి డ్రామా ఆడి, కోడికత్తి డ్రామాతో రాష్ట్ర ప్రజలను, సొంత కుటుంబాన్ని మోసం చేసి.. ఇప్పుడు మళ్లీ సిగ్గులేకుండా గులకరాయి డ్రామాతో జగన్‌ జనాల్లోకి వస్తున్నాడని విమర్శించారు. అధికారం పరమావధి కాదు మార్పు పరమావధి అని పవన్‌ వ్యాఖ్యానించారు. జగన్‌కు గాయమైతే రాష్ట్రానికి గాయమన్నట్లు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని.. రాష్ట్రంలో ఉపాధి లేక రోడ్లపై ఉన్న యువతకు గాయం కాదా.. బాపట్లలో 15 ఏళ్ల అమర్నాథ్‌ను వైసీపీ నాయకులు పెట్రోలు పోసి చంపేస్తే అది గాయం కాదా.. జగన్‌కు గులకరాయి తగిలితే రాష్ట్రానికి గాయమా.. అని నిలదీశారు.

బాధలు గుర్తుకు రాలేదా: చంద్రబాబు

జగన్‌ నాటకాలను ఎవరూ నమ్మరు. ఈయన సభ పెడితే కరెంటు పోయిందంట.. పవన్‌ కల్యాణ్‌ వచ్చి రాయి విసిరాడంట.. నేను రాయి వేయించానంటూ కొత్త డ్రామా మొదలుపెట్టాడు. మాపైన వేసిన రాళ్లు దొరికాయి. కానీ ఈ డ్రామారాయుడిపై వేసిన రాయి మాత్రం దొరకలేదు. గత ఐదేళ్లుగా పరదాలు కట్టుకుని తిరిగి.. ఈ రోజు ఓట్ల కోసం బయటకు వచ్చాడు. 2014లో తన తండ్రి చనిపోయాడని, 2019లో తన బాబాయిని చంపేసి ఎవరో చంపేశారని, ఇప్పుడు పింఛనుదార్లు చనిపోయారంటూ ఓట్ల కోసం శవాలతో వస్తున్నాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వదిలిపెట్టి పోవడం చూసి బెంబేలెత్తిపోయాడు. బాబాయిపై గొడ్డలి పోటును మాపై నెట్టాలని చూశాడు. ఈ రోజు బాబాయి కూతురే ప్రశ్నిస్తోంది. ముందు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నీపై గులకరాయి పడితే హత్యాయత్నం అంటున్నావు.. ఇది మీ పోలీసుల చేతకాని తనం కాదా! దళితుడిని చంపి డోర్‌ డెలివరీ చేసిన వాడిని, దళితులకు శిరోముండనం చేసిన వారిని పక్కన పెట్టుకు తిరుగుతున్నాడు. నా ఎస్సీ, నా బీసీ అంటే ఇదేనా? జడ్జీలను ఇష్టానుసారంగా తిట్టిన ఓ ఎన్‌ఆర్‌ఐని సీబీఐ వెతుకుతుంటే అతడిని తన పక్కనే పెట్టుకు తిరుగుతున్నాడు. రేపల్లెలో అమర్నాఽథ్‌గౌడ్‌ అనే బాలుడు తన అక్కను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా అతడిని పెట్రోలు పోసి తగులబెట్టినప్పుడు ఈ సైకోకు ప్రజలు, వారి బాధలు గుర్తుకు రాలేదు. అందుకే ఈయన పేరును ‘జే గన్‌ రెడ్డి సైకో’ అని మార్చా.

బెదిరింపులకు అదరని యోధుడు పవన్‌

ఎన్ని బెదిరింపులు వచ్చినా అదరక బెదరక యో ధుడిగా నిలబడిన వ్యక్తి పవన్‌. కృష్ణా జిల్లాలో ఇద్దరు నానీలు ఉన్నారు. ఒకడు బూతుల నాని, మరొకడు నీతుల నాని. బందరులో నితీశ్‌ అన్న వ్యక్తి మాల్‌ కట్టుకుంటే డబ్బులు ఇవ్వలేదని ఎన్‌వోసీ ఇప్పించలే దు. భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్‌ ను అడ్డుకున్న వ్యక్తి ఈ నాని కాదా? ఈయన పోయి కిట్టూ(పేర్ని నాని కొడుకు) వచ్చాడు. నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్‌, సెటిల్‌మెంట్ల బ్యాచ్‌కు లీడర్‌ ఈయనే. అధికారంలోకి వస్తే చేనేతలకు 200 యూ నిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు విద్యుత్‌ ఉచితంగా ఇస్తాం. కలంకారీలకు ప్రత్యేక క్లస్టరు ఏర్పాటు చేస్తాం. మత్స్యకారుల పొట్టకొట్టే జీవో 217ని రద్దు చే స్తాం. బందరు పోర్టును కాసుల కోసం అటకెక్కించారు. పోర్టును అభివృద్ధి చేసేది టీడీపీయే. మేమందరం కలిశామని జగన్‌ అంటున్నాడు. మూడు వేర్వేరు జెండాలైనా మాది ఒకే ఎజెండా. తెలుగు ప్ర జలు అభివృద్ధే మా ఎజెండా. జగన్‌ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. దానిని ఓడించేందుకే పొత్తు పెట్టుకున్నాం. గతంలో ఎన్డీయేలో ఉన్నప్పుడూ ఏ ఒక్క ముస్లింకు అన్యాయం జరగలేదు. కూటమి అధికారంలోకి వస్తే రామరాజ్య స్థాపనకు కృషి చేస్తామని శ్రీరామనవమి పర్వదినాన హామీ ఇస్తున్నా.

చంద్రబాబు ఐదేళ్లలో విద్యుత్‌ చార్జీలు పెంచలేదు

జగన్‌ 10 సార్లు పెంచాడు!

సొంత బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిపై ఎవరైనా దాడి చేయగలరా?: పవన్‌

జగన్‌పై దాడి చేయడానికి మాకు పనీపాటా లేదా? సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపించిన వ్యక్తిపై ఎవరైనా దాడి చేయగలరా?

- పవన్‌ కల్యాణ్‌

ఎన్నో సర్వేల్లో రాష్ట్రంలో ఎన్డీయే 17 నుంచి 23 ఎంపీ సీట్లు గెలుస్తుందని తేలింది. అందుకే జగన్‌రెడ్డి డ్రామాలు మొదలుపెట్టాడు.

నిన్నటి వరకు జగన్‌ పరదాలు కట్టుకుని తిరిగి ఇప్పుడు దోచుకున్న వేల కోట్లతో ప్రజలను కొనాలని చూస్తున్నాడు. మా వద్ద డబ్బు లేదు. రాష్ర్టాన్ని తిరిగి గాడిలో పెట్టగల శక్తి ఉంది.

నామీద, పవన్‌ కల్యాణ్‌ మీద దాడులు జరిగినప్పుడు జగన్‌ కనీసం ఖండించలేదు. ఆయనపై గులకరాయి దాడి జరిగినప్పుడు ఇద్దరం ఖండించాం.

- చంద్రబాబు

వారాహి రోడ్లపైకి ఎలా వస్తుందో చూస్తానన్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే(పేర్ని నాని). ఇలాంటి తాటా కు బెదిరింపులకు భయపడతామా? వారి నాయకు డు దిగజారుడుతనంతో మాట్లాడుతుంటాడు. ఆయ న సతీమణిని ఎప్పుడైనా జగన్‌ పెళ్లామని అంటా మా? సొంత చెల్లిని వేధించేవాడు.. గోడకేసి కొట్టేవాడి ని ఈ ఎన్నికల్లో పక్కన పెట్టకపోతే రాష్ట్రానికే కాదు.. దేశానికే చీడపురుగులా తయారవుతాడు. వైనాట్‌ 175 అంటున్నాడు జగన్‌. ఆయన చేసిన పాలనకు వైనాట్‌ 15 అని అడుగుతున్నాం. యువత కులాలు దాటి రావాలి. కుల గణాంకాలతోపాటు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ గణాంకాలు కూడా తీయాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గం ఎందుకు మారానని జగన్‌ భీమవరం సభలో నన్ను ప్రశ్నించాడు. నా సంగతి సరే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను ఎందుకు మార్చా వో సమాధానం చెప్పు. 70 నియోజకవర్గాల్లో ఎమ్మె ల్యే అభ్యర్థులను ఎందుకు మార్చాల్సి వచ్చింది? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెల్లదు. క్లాస్‌వార్‌ అని చెప్పే జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే పేదల కడుపు కొట్టాడు. ఉపాధి హామీ నిధుల్లో దేశంలో అత్యంత అవినీతి మన రాష్ట్రంలో జరిగిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారు. పోలీసులకు ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అమలు చేయకుండా దోపిడీ చేసిన ఘనత జగన్‌దే. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. జగన్‌ పదిసార్లు పెంచాడు. కల్తీ మద్యం సరఫరా చేస్తూ మహిళల మంగళసూత్రాలు తెంచుతున్నారు. ఇలాంటి వైసీపీని తన్ని తగలేయాలి.

Updated Date - Apr 18 , 2024 | 03:54 AM

Advertising
Advertising