ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నలుగురు ఐఏఎస్ లకు బెయిలబుల్‌ వారెంట్‌

ABN, Publish Date - Oct 22 , 2024 | 04:12 AM

కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్‌ అధికారులపై హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్‌ అధికారులపై హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తామిచ్చిన ఆదేశాలను అమ లు చేయని పక్షంలో కోర్టు ముందు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎ్‌స.రావత్‌, కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జలవనరులశాఖ ఈఈ డీవీ.రామ్‌గోపాల్‌పై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రీ.. వారెంట్‌ అమలు చేసేందుకు వీలుగా విచారణను నవంబర్‌ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Oct 22 , 2024 | 04:14 AM