ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బెల్టు షాపులను రద్దు చేయాలి

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:10 AM

మంత్రాలయం క్షేత్రంలో బెల్టు షాపులను రద్దు చేయాలని మండల టీడీపీ కన్వీనర్‌ పన్నగ వెంకటేశ స్వామి అన్నారు.

మంత్రాలయంలో బెట్లు షాపుల రద్దు చేయాలని ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు

తెలుగు తమ్ముళ్ల ధర్నా

మంత్రాలయం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం క్షేత్రంలో బెల్టు షాపులను రద్దు చేయాలని మండల టీడీపీ కన్వీనర్‌ పన్నగ వెంకటేశ స్వామి అన్నారు. శుక్రవారం సాయంత్రం నాయకులు, కార్యకర్తలు టీడీపీ కార్యాలయం నుంచి రాఘవేంద్ర సర్కిల్‌కు చేరుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా పన్నగ వెంకటేశ స్వామి మాట్లాడుతూ మంత్రాలయంలో ఎంటీఆర్‌, ఆర్టీసీ బస్టాండు, రాఘవేంద్రపురం, రామచంద్రనగర్‌, ఓల్డ్‌టౌన, నాగలదిన్నె రోడ్డు, నదితీరం, నది ఒడ్డున ఇలా అనేక చోట్ల బెల్టు షాపులు ఏర్పాటు చేశారని అన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇనచార్జి ఎల్లారెడ్డి, విజయరామిరెడ్డి, గువ్వల భీమన్న, యేబు, వగరూరు అబ్దుల్లా, కృష్ణమోహన రెడ్డి, బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు అమర్నాథ్‌ రెడ్డి, నరసింహులు, కేశన్న, పవన కుమార్‌, సుంకప్ప, సుజ్ఞానం, హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:10 AM