Best worker award : ఆర్మీలో మనోహర్‌కు బెస్ట్‌వర్కర్ అవార్డు
ABN, Publish Date - Oct 15 , 2024 | 11:34 PM
బ్రాహ్మణపల్లె వాసి అక్కిశెట్టి మనోహర్‌కు ఇండియన్ ఆర్మీ ఎలకా్ట్రనిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ విభాగంలో లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వాపినే ద్వారా బెస్ట్‌వర్కర్ అవార్డును అందుకున్నారు.
గోపవరం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): బ్రాహ్మణపల్లె వాసి అక్కిశెట్టి మనోహర్‌కు ఇండియన్ ఆర్మీ ఎలకా్ట్రనిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ విభాగంలో లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వాపినే ద్వారా బెస్ట్‌వర్కర్ అవార్డును అందుకున్నారు.
బ్రాహ్మణపల్లెకు చెందిన అక్కిశెట్టి వెంకటసుబ్బయ్య, అమ్మణ్ణమ్మ తృతీయ పుత్రు డు అక్కిశెట్టి మనోహర్ నాలుగు దశాబ్ధాలుగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. ఆయన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈఎంఈలో ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. కాగా మంగళవారం తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ నగరం భారత రక్షణ శాఖ ఎలకా్ట్రనిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన సంస్థ 82వ ఆవిర్భావ దినత్సోవంలో ఉత్తమ సేవ లను అందించిన పలువురికి లెఫ్టినెంట్ జనరల్ అవార్డులను ప్రకటించారు ఇందు లో మనోహర్ ఒకరు. ఈఎంఈ కోర్‌డే 2024 సందర్భంగా అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకున్న మనోహర్‌ను తెలుగు భాషా సంరక్షణ సమితి జిల్లా సహాయ కార్యదర్శి గంగపల్లి వెంకటరమణ, బంధుమిత్రులు, గ్రామస్తులు అభినందించారు.
Updated Date - Oct 15 , 2024 | 11:34 PM