ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాధారణ స్థితికి భవానీ ద్వీపం

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:01 AM

వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న భవానీ ఐల్యాండ్‌ను ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చైర్మన్‌ నూకసాని బాలాజీ సోమవారం సందర్శించారు.

ఆంధ్రజ్యోతి-విజయవాడ: వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న భవానీ ఐల్యాండ్‌ను ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చైర్మన్‌ నూకసాని బాలాజీ సోమవారం సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల కారణంగా ద్వీపానికి జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ద్వీపం పునరుద్ధరణకు సత్వరం తీసుకోవాల్సిన చర్యలను ఏపీటీడీసీ అధికారు లు చైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు. వరద ల్లో చిక్కుకున్న భవానీ ద్వీపం, హరిత బెర్మ్‌పార్క్‌, బోటింగ్‌ యూనిట్లను తిరిగి మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావటానికి తాత్కాలికంగా రూ.40లక్షలు, శాశ్వ త ప్రాతిపదికన నిర్మించటానికైతే దా దాపుగా రూ.5కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పినట్టు తెలిసింది. కార్తీక మా సంలో రూ.కోటికి పైగా ఆదాయం వ స్తుందని, వచ్చే కార్తీక మాసానికల్లా పు నరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని వి జ్ఞప్తి చేశారు. సాధారణ ఆతిథ్య సేవలు ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకు ప్రయత్నించాలని అధికారులను చైర్మన్‌ ఆదేశించారు. ఆర్థిక సమస్యలతో ముడిపడిన వాటికి తక్షణం ప్రభుత్వం సా యం కోరతానన్నారు. భవానీ ఐల్యాం డ్‌, హరిత బెర్మ్‌ పార్క్‌లను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చర్యలు తీ సుకుంటానన్నారు. చైర్మన్‌ పరిశీలనలో ఏపీటీడీసీ చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహారా వు, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఈశ్వరయ్య, విజయవాడ డివిజినల్‌ మేనేజర్‌ చైతన్య పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:01 AM