ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోడ్రన్‌ ఎయిర్‌పోర్టుగా భోగాపురం

ABN, Publish Date - Jul 12 , 2024 | 04:39 AM

భోగాపురం విమానాశ్రయాన్ని మోడ్రన్‌ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

2026 జూన్‌ 30కి ముందే నిర్మాణం పూర్తి

రూ.4,700 కోట్ల వ్యయంతో పనులు

ఎకనామిక్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర

అన్నీ సజావుగా జరిగినట్టయితే

2023 నాటికే వినియోగంలోకి: చంద్రబాబు

విజయనగరం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయాన్ని మోడ్రన్‌ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. చంద్రబాబుకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహననాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు చంద్రబాబు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఎయిర్‌పోర్టు పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు. గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్‌ గజపతిరాజు పలు సలహాలు, సూచనలు అందించారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఎయిర్‌పోర్టును 2026 జూన్‌ 30నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారని, అంతకంటే ముందుగానే పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఫేజ్‌-1లో భాగంగా భోగాపురం వరకు బీచ్‌రోడ్డు, ఫేజ్‌-2లో మరో 50 కిలోమీటర్లతో శ్రీకాకుళం, ఫేజ్‌-3లో మూలపేట వరకు రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు.

కనెక్టివిటీ ముఖ్యం.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.4,700 కోట్లు వ్యయం చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. 45 లక్షల మంది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణాలు సాగించవచ్చని అంచనాగా ఉందన్నారు. ఈ ఎయిర్‌పోర్టు పూర్తయి వినియోగంలోకి వస్తే ఉత్తరాంధ్ర ఎకనమిక్‌ హబ్‌గా తయారవుతుందన్నారు. ఏ ఎయిర్‌పోర్టుకైనా కనెక్టివిటీ ముఖ్యమని, హైదరాబాద్‌కు ఔటర్‌ రింగురోడ్డు ఏర్పాటు చేశామని, ఎక్కడి నుంచైనా విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా కనెక్టివిటీ ఏర్పాటు చేశామన్నారు.

సజావుగా సాగి ఉంటే...

2015లోనే ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని చంద్రబాబు వివరించారు. 2016 అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. రైతుల నుంచి 2,700 ఎకరాలు సేకరించామన్నారు. అన్ని సజావుగా జరిగినట్టయితే 2023 నాటికే ఈ ఎయిర్‌పోర్టు వినియోగంలోకి రావల్సి ఉందన్నారు.

Updated Date - Jul 12 , 2024 | 04:39 AM

Advertising
Advertising
<