కబ్జా యత్నాలు
ABN, Publish Date - Oct 03 , 2024 | 11:56 PM
ఆదోని పట్టణానికి ఆనుకుని ఉన్న మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని బైపాస్ రోడ్డులోని శ్రీనివాస పద్మావతి ఎస్టేట్‌లో సర్వేనెంబర్ 480 ఏ, 481లో40 సెంట్లు స్థలం ఓపెన సైట్‌గా ఉంది.
పంచాయతీ స్థలమని బోర్డు పెట్టినా నల్ల రంగు వేసిన వైనం
పట్టించుకోని పంచాయతీ అధికారులు
స్థలం విలువ రూ.4 కోట్లుపై మాటే
ఆదోని, అక్టోబరు 3 : ఆదోని పట్టణానికి ఆనుకుని ఉన్న మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని బైపాస్ రోడ్డులోని శ్రీనివాస పద్మావతి ఎస్టేట్‌లో సర్వేనెంబర్ 480 ఏ, 481లో40 సెంట్లు స్థలం ఓపెన సైట్‌గా ఉంది. అందులో ఆ కాలనీ సంబంధించిన పార్కు లేదా దేవాలయాలు, తాగునీటి, ట్యాంకులు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉంచారు. ఈ స్థలంలో కొంతమంది కాంపౌండ్ వాల్ కోసం గుంతలు తవ్వి బండలు పాతారు. కాలనీలో నివసిస్తున్న వారు ఓపెన సైట్లో ఎలా కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని ప్రశ్నించగా.. తమకు 2004లోనే పట్టాలు ఇచ్చారని కబ్జాదారులు అన్నారు. అప్పట్లో వైసీపీని అడ్డం పెట్టుకుని కొంతమంది లీడర్లు ఆ స్థలానికి పట్టాలు ఇచ్చినట్లు నకిలీ పట్టాలు సృష్టించి కబ్జా చేసేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేసినట్లు తెలుస్తోంది. నకిలీ డ్యాక్యుమెంట్లు సృష్టించడం కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం ఆదోనిలో అనువాయితీగా మారింది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని కబ్జాదారులు దర్జాగా అక్రమ కట్టడాలు చేపడుతున్నా అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ఆదోనిలో చాలా చోట్ల ఇలాంటి ఆక్రమణలు పెరిగిపోయాయి. సాధారణంగా రస్తా, వంక పోరంబోకులో ఎటువంటి కట్టడాలు చేపట్టడం చట్టరీత్యా నేరం. ఒక వేళ పట్టాలిచ్చినా అవి ఏ మాత్రం చెల్లవు. అయితే ఈ నిబంధనలను ఖాతరు చేయకుండా ఇస్టానుసారంగా అక్రమ నిర్మాణాలను చేపట్టి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పేదవాడు సెంటు స్థలాన్ని ఆక్రమిస్తే ఆఘమేఘాలపై అక్కడికి వెళ్ళి అడ్డుకునే రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నా కనీసం ఆటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. భారీస్థాయిలో పంచాయితీ, రెవెన్యూ అధికారులకు నజరానాలు ముట్టజెప్పడంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిస్తున్నాయి. దీనిపై పలుమారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.
ఫ గతంలో ఆంధ్రజ్యోతి వెలుగులోకి..
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కొంతమంది ఓపెన సైట్‌లో కాంపౌండ్ కింద నాప బండలు పాఆరని గతంలో ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించడంతో ఆఘ మేఘాల మీద వెళ్లిన పంచాయతీ అధికారులు ఇది ప్రభుత్వ స్థలమని, బోర్డు పాతారు. కాంపౌండ్ కింద ఏర్పాటు చేసిన బండలను సైతం కూల్చేశారు. అప్పటి నుండి అధికారులు తిరిగి అటువైపు చూడలేదు.
ఫ పాతిన బోర్డుపై బ్లాక్ పెయింట్ వేసిన కబ్జాదారులు
ప్రభుత్వ స్థలమని, ఇక్కడ ఎవరూ ఎలాంటి కట్టడాలు చేపట్టరాదని పంచాయతీకి సంబంధించిన ఓపెన సైట్ అని బోర్డు రాశారు. ఆ బోర్డును ఇటీవల కొందరు గుర్తించి తెలియని వ్యక్తులు చెరిపేసి బ్లాక్ రంగు వేశారు. ఇది ఇలా ఉండగా.. ఆదోని పట్టణంలో పాటు మండగిరి పంచాయతీలో ఆక్రమణలు అధికమయ్యాయి. గతంలో తాహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఆర్‌ఐ మండిగిరి పంచాయతీలో ఉన్న వంక పోరంబోకులను గుర్తించి వాటికి పట్టాలు ఇచ్చారు. అందులో కొంతమంది ప్రహరీ నిర్మాణం చేపట్టిగా, మరికొందరు ఇంటి నిర్మాణాలు చేపట్టారు. అప్పటి అధికార వైసీపీకి చిన్న బాసుగా చలామణి అయిన వారి కనుసన్నల్లోనే వైసీపీ నేతలతో పాటు రెవెన్యూ అధికారులు, విలేకరులకు పట్టాలు ఇచ్చారు. ఈ నిర్మాణాల వల్ల ఎగువను వర్షాలు అధికంగా కురిస్తే కాలువ నీళ్లు ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. ఈ స్థలం కోసం కొంతమంది నకిలీ విలేకరులు కూడా అప్పుడున్న ఓ అధికారికి పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఫ వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఇచ్చిన పట్టాను రద్దు చేయాలి. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎక్కడబడితే అక్కడ ఓ రెవెన్యూ అధికారి డబ్బులు పుచ్చుకొని ఎక్కడపడితే అక్కడ పట్టాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అక్రమంగా ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. సర్వేనెంబర్ 480ఏ,481లో 40సెంటు ఓపెన సైట్ ఉందని, దాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ ఓపెన సైట్‌లో 12 మందికి 2004లో పట్టాలు ఇచ్చినట్లు తెలుస్తోందని, అలా ఎలా ఇచ్చారో విచారణ చేస్తున్నామని వివరణ ఇచ్చారు.
Updated Date - Oct 03 , 2024 | 11:56 PM