పోలీసు స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు..
ABN, Publish Date - Nov 16 , 2024 | 03:55 AM
రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై స్థాయీ నివేదిక (స్టేటస్ రిపోర్ట్) సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
స్థాయీ నివేదిక ఇవ్వాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం
అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై స్థాయీ నివేదిక (స్టేటస్ రిపోర్ట్) సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావ ుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2019 జులై 15న ధర్మాసనం ఆదేశాలిచ్చిన్న విషయాన్ని గుర్తు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని స్పష్టం చేసింది. ఏళ్లు గడుస్తున్నా ఉత్తర్వులు అమలుకాకపోవడంతో పిటిషనర్ కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
Updated Date - Nov 16 , 2024 | 03:55 AM