ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెల్‌ఫోన ను అభివృద్ధికి ఉపయోగించాలి

ABN, Publish Date - Nov 10 , 2024 | 11:58 PM

అరచేతిలోకి సెల్‌ రూపంలో వచ్చిన ఆధునిక విజ్ఞానాన్ని అభివృద్ధికే ఉపయోగించుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు.

జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభిస్తున్న టీజీ వెంకటేశ, బీవీ రెడ్డి, జి.పుల్లయ్య తదితరులు.,

- రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ

కర్నూలు కల్చరల్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): అరచేతిలోకి సెల్‌ రూపంలో వచ్చిన ఆధునిక విజ్ఞానాన్ని అభివృద్ధికే ఉపయోగించుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు. ఆదివారం నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో, కళాక్షేత్రం అధ్యక్షుడు విద్వాన పత్తి ఓబులయ్య రాసిన ‘సెల్లు (సెల్‌ఫోన) పురాణం’ శతక పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీ వెంకటేశ తొలుత పుస్తకాన్ని అంకితం ఇచ్చిన దివంగత విశ్రాంత ప్రిన్సిపాల్‌.. నెల్లూరుకు చెందిన పమిడి వెంకటేశ్వర్లు చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెల్‌ఫోన రాకతో ప్రపంచంలో ఎక్కడికైనా క్షణాల్లో సంప్రదింపులు జరిపే అవకాశం ఏర్పడిందని అన్నారు. అయితే సెల్‌ఫోనను విజ్ఞానానికి, వినోదానికి ఉపయోగించుకోవాలని అన్నారు. అయితే కొంతమంది దీనివల్ల పెడదోవ పట్టే ప్రమాదం ఉందని అన్నారు. పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని, మనిషి జీవితంలో సెల్‌ఫోన ఒక భాగంగా మారిందని చెప్పారు. రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్‌ జి. పుల్లయ్య మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం వల్ల లాభాలూ, నష్టాలూ ఉన్నాయని, అయితే లాభాలకే వాడుకోవాలని అన్నారు. రచయిత పత్తి ఓబులయ్య మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సెల్‌ఫోన వినియోగం ఎలా మారిందో తెలియజేసేందుకు ఈ పుస్తకం రాశానని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగస్థల కళాకారులు మహ్మద్‌ మియా, కె. బాలవెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, శ్యామ్యూల్‌ సెల్లు పురాణంలోని హాస్య శతక పద్యాలను చదవి వినిపించారు.

Updated Date - Nov 10 , 2024 | 11:58 PM