ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu : వెనక్కి వచ్చేయండి!

ABN, Publish Date - Aug 01 , 2024 | 04:36 AM

ఐదేళ్లూ సాగిన ఆర్థిక అరాచకానికి బలైన పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వైసీపీ వేధింపులతో వెనక్కి వెళ్లిన పారిశ్రామికవేత్తలతో చర్చలకు నిర్ణయం

వారికి భరోసా కల్పించే దిశగా చర్యలు

రాష్ట్రంలో పారిశ్రామిక పునరుత్తేజానికి 5 పాలసీలు 4 కొత్త క్లస్టర్లు 2014-19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలను గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేసి తరిమివేసింది. వారందరినీ తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చి పారిశ్రామికాభివృద్ధిని తిరిగి పరుగులు పెట్టించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. భయపడాల్సిన పనిలేదనే భరోసాను పారిశ్రామికవేత్తలకు ఇవ్వనుంది. ఐదేళ్లూ కుంటుబడిన పరిశ్రమలను గాడిలో పెట్టేందుకు ఐదు పారిశ్రామిక పాలసీలను, అదనంగా నాలుగు ఇండస్ర్టియల్‌ క్లస్టర్లను తీసుకురావాలని పరిశ్రమల శాఖపై జరిపిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఏడాదికి లక్ష కోట్ల పెట్టుబడులు..1.36 లక్షల ఉద్యోగాలు

ఇదే లక్ష్యంతో పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక

పరిశ్రమలపై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు

పెండింగ్‌ ప్రోత్సాహకాల చెల్లింపుపై సానుకూలత

మల్లవల్లి భూముల ధరలు తగ్గింపునకు ఆదేశాలు

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లూ సాగిన ఆర్థిక అరాచకానికి బలైన పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంటుపడిన పారిశ్రామికాభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమైంది. 2014-19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలను గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేసి తరిమివేసింది. రాష్ట్రంలో బిజినెస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున పారిశ్రామికవేత్తలు భయపడాల్సిన పనిలేదనే భరోసా కల్పించాలని నిర్ణయించింది. ఐదేళ్లూ కుంటుబడిన పరిశ్రమలను పరుగులు తీయించేందుకు ఐదు పారిశ్రామిక పాలసీలను తీసుకురావాలని కూడా నిశ్చయించింది. పరిశ్రమలశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఇలా కీలక నిర్ణయాలెన్నో తీసుకున్నారు. ఐదు పాలసీలనూ వచ్చే వంద రోజుల్లోనే రూపొందించాలని ఆదేశించారు. తద్వారా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడు లు పెట్టేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. గత పదేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు చేసుకున్న ఒప్పందాలు, వాటి అమలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రాన్ని గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా తయారు చేయాలనే లక్ష్యంతో పారిశామ్రిక పాలసీలను రూపొందించాలని సూచించారు. రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన పారిశ్రామిక సంస్థలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నించాలన్నారు. కృష్ణపట్నం, నక్కపల్లి, ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్‌ నోడ్స్‌ అభివృద్ధి పనులపై చర్చించారు. నక్కపల్లిలో రూ.11,542 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్‌ డ్రగ్‌ పార్క్‌, రూ. 60వేల కోట్లతో ఏర్పాటయ్యే ఎన్‌టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌, భవిష్యత్తులో రాష్ట్రంలో రూ.75వేల కోట్లతో ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌ ఏర్పాటు కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతున్న బీపీసీఎల్‌ ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు.


ప్రగతి సాధన దిశగా...

రాష్ట్రంలో ప్రస్తుతం 4 పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని, మరో నాలుగు క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేసి.. కేంద్ర ఆనుమతులు పొందేందుకు త్వరగా ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. కొత్త క్లస్టర్లలో ఎలకా్ట్రనిక్స్‌, ఫార్మా, ఫుడ్‌ప్రాసెసింగ్‌, హార్డ్‌వేర్‌ సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా.. వైసీపీ ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త, కక్షపూరిత విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని, పరిశ్రమల కోసం కేటాయించిన భూములను కొన్ని కంపెనీలు ఇతర అవసరాల కు ఉపయోగించుకోవడంతో దుర్వినియోగమయ్యాయని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం వేధింపులతో భూ కేటాయింపులు చేసిన తర్వాత కూడా అనేక కంపెనీలు తిరిగి వెళ్లిపోయాయని వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో 1,382 ఎకరాలను ఇళ్ల పట్టాల కోసమంటూ తీసుకున్నారని తెలిపారు.

సడలిన నమ్మకాన్ని తిరిగి సాధిస్తాం..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు 66 శాతం ప్రోత్సాహకాలు చెల్లించగా.. వైసీపీ ప్రభుత్వం 34శాతమే చెల్లించిందని అధికారులు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, తద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. 2014-19 కాలంలో 64 ఇండస్ట్రియల్‌ పార్కుల ద్వారా 14,125 ఎకరాలు అందుబాటులోకి తెస్తే.. 2019-24 మధ్య కేవలం 31పార్కులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇలాంటి పరిణామాల వల్లే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. గతంలో ఒప్పందాలు కుదుర్చుకుని.. తర్వాత వైసీపీ ప్రభుత్వ వేధింపులతో వెనక్కి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలతో మళ్లీ సంప్రదింపులు జరపాలని, అవసరమైతే తాను కూడా వారితో మాట్లాడతానని చెప్పారు. పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏడాదిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తిచేసి 1,36,260 మందికి ఉపాధి కల్పించాలని చెప్పారు. ఉమ్మడి కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడను వైసీపీ ప్రభుత్వం వివాదాల్లోకి నెట్టేసి.. నిర్వీర్యం చేసిందని, అక్కడ భూముల ధరలు తగ్గించి.. పెట్టుబడులకు ఊతమివ్వాలని సీఎం ఆదేశించారు.

బాబు బ్రాండ్‌తోనే పెట్టుబడులు

సీఎం చంద్రబాబే రాష్ట్రానికి పెద్దబ్రాండ్‌ అని, ఆయనపై నమ్మకంతో పెత్తఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం సచివాలయం నాలుగో బ్లాక్‌లోని పబ్లిసిటీ సెల్‌లో మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వానికి రాజకీయ అజెండా తప్ప.. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే నిర్దిష్ట పారిశ్రామిక విధానమే లేదని విమర్శించారు. ‘‘పారిశ్రామికవేత్తలకు ఇష్టముంటే వస్తారు. లేదంటే లేదు.. రెడ్‌కార్పెట్‌ వేసి స్వాగతించాల్సిన అవసరం లేదు’’ అనేదే గత పాలకుల విధానమని ఎద్దేవా చేశారు. అందుకే గత ఐదేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి అనేదే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. గత పదేళ్లలో రూ.11లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా.. వాటిలో దాదాపు రూ.7లక్షల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు 2014-19 మఽధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్‌ అయ్యాయో దేవునికే తెలియాలని చెప్పారు.. ఎవరైనా పరిశ్రమ పెట్టడానికి వస్తే వైసీపీ నాయకులు వాటాలు అడిగేవారని, ఇవ్వకపోతే రకరకాలుగా వేధింపులకు గురిచేయడంతో అనేక కంపెనీలు తిరిగి వెళ్లిపోయాయని వివరించారు. రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు 5 కొత్త పాలసీలు రూపొందించాలని సీఎం ఆదేశించారని, వాటికి సంబంధించిన డ్రాఫ్టులను 15 రోజుల్లో రూపొందిస్తామని తెలిపారు.

ఇవీ ఐదు పాలసీలు..

1)నూతన ఇండస్ట్రియల్‌ పాలసీ 2)ఎంఎ్‌సఎంఈ పాలసీ 3) ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ 4)ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ క్లౌడ్‌ పాలసీ, 5) టెక్స్‌టైల్స్‌ పాలసీ

ఇవీ నాలుగు క్లస్టర్లు..

కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ/పామూరు.

Updated Date - Aug 01 , 2024 | 04:40 AM

Advertising
Advertising
<