ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజనరీ ఉన్న నేత చంద్రబాబు

ABN, Publish Date - Nov 14 , 2024 | 03:49 AM

సీఎం చంద్రబాబు మంచి విజనరీ ఉన్న నాయకుడని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురూజీ రవిశంకర్‌ వ్యాఖ్యానించారు.

అమరావతిని అద్భుతంగా తయారు చేస్తారు

పిల్లల్లో శాస్ర్తీయ ఉత్సుకత పెంచాలి

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురూజీ రవిశంకర్‌ ఉద్బోధ

విజయవాడ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు మంచి విజనరీ ఉన్న నాయకుడని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురూజీ రవిశంకర్‌ వ్యాఖ్యానించారు. ఆయన అమరావతిని అద్భుతంగా తయారు చేస్తారన్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో విజయవాడలోని బబ్బూరి గ్రౌండ్స్‌లో బుధవారం రాత్రి ‘గానం-ధ్యానం-జ్ఞానం’ పేరిట జరిగిన మహాసత్సంగ్‌ కార్యక్రమంలో రవిశంకర్‌ పాలొని మాట్లాడారు. జీవితం ఒక మహావృక్షమని, దానికి ఉండే వేళ్లు పురాతనమైతే, ఆకులు, పూలు నూతనమని ఆయన చెప్పారు. పిల్లల్లో శాస్త్రీయ ఉత్సుకతను తల్లిదండ్రులు పెంచాలన్నారు. అనేక విశేషాల సమ్మేళనమే సంస్కృతి అని, ప్రజలంతా వసుధైక కుటుంబంలా ఉండాలన్నారు. జీవితంలో ఒత్తిడితో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఆత్మహత్య భావనను ఆధ్యాత్మిక శక్తి ద్వారా దూరం చేసుకోవచ్చునని ఆయన సూచించారు. ప్రపంచశాంతి కోసం ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ పనిచేస్తోందని, ప్రపంచంలో 25 వేలమంది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో టీచర్లుగా 10 వేల కేంద్రాల్లో సేవలు అందిస్తున్నారని తెలిపారు. గానం, ధ్యానం, జ్ఞానం మనిషి జీవితాన్ని మలుపు తిప్పుతాయని చెప్పారు. రాజధాని అమరావతికి, కృష్ణానదికి చెంతనే ఉన్న విజయవాడను హ్యాపీయెస్ట్‌ సిటీ చేయడానికి ప్రజలు కంకణం కట్టుకోవాలని గురూజీ రవిశంకర్‌ కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారితో రవిశంకర్‌ 15 నిమిషాలపాటు ధ్యానం చేయించారు.

చంద్రబాబును కలిసిన రవిశంకర్‌

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో గురూజీ రవిశంకర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. రవిశంకర్‌కు సీఎం సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. అనంతరం అనేక విషయాలపై వారిద్దరు ముచ్చటించుకున్నారు.

Updated Date - Nov 14 , 2024 | 03:49 AM