నేడు గుజరాత్‌కు సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 16 , 2024 | 03:17 AM
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఈ నెల 16 నుంచి 18 వరకు జరగనున్న రెన్యూవబుల్ ఎనర్జీ(ఆర్‌ఈ) ఇన్వెస్టర్స్ మీట్-2024లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సోమవారం ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు.
రెన్యూవబుల్ ఎనర్జీ సదస్సుల్లో పాల్గొననున్న సీఎం
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఈ నెల 16 నుంచి 18 వరకు జరగనున్న రెన్యూవబుల్ ఎనర్జీ(ఆర్‌ఈ) ఇన్వెస్టర్స్ మీట్-2024లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సోమవారం ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. పునరుత్పాదక విద్యుత్తు రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ఆయన సదస్సులో కీలకోపన్యాసం చేస్తారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు.
ప్రధాని మోదీతో ప్రత్యేక సమావేశం!
ఆర్‌ఈ ఇన్వె్‌స్ట-2024కు ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానితో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - Sep 16 , 2024 | 03:18 AM