ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu Naidu: గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

ABN, Publish Date - Jun 11 , 2024 | 06:00 PM

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడును గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ఆహ్వానించారు.

విజయవాడ, జూన్ 11: ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయడానికి జరగాల్సిన ప్రక్రియ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడును గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ఆహ్వానించారు. ఆ క్రమంలో తనకు మద్దతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబితాను ఈ సందర్బంగా గవర్నర్‌కు చంద్రబాబు అందజేశారు. భేటీ అనంతరం రాజ్‌భవన్ నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. కాగా రేపు (బుధవారం) ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయన చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. అందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. అయితే వాటిని పరిశీలించేందుకు రావాలని ఈ సందర్బంగా గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు విజ్జప్తి చేశారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బరిలో నిలిచి గెలిచింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ గవర్నర్‌ కోరారు. అయితే ఈ రోజు ఉదయం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమైన సంగతి తెలిసిందే. ఇక కూటమిలోని జనసేన. బీజేపీ ఎమ్మెల్యేలకు కీలక మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నట్లు ఓ చర్చ సైతం సాగుతుంది.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 06:27 PM

Advertising
Advertising