ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాములోరికి సాయమా?

ABN, Publish Date - Oct 20 , 2024 | 03:26 AM

విశాఖ శారదాపీఠానికి తక్షణమే భూకేటాయింపులను ర ద్దుచేయాలని, ఇందుకు ఫైలు పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ఫైలు పంపింది.

  • తెర వెనుక ఎవరు?

  • సీఎం ఆదేశించినా విడుదలకాని ఉత్తర్వులు

  • భూకేటాయింపు రద్దు ఫైలు మళ్లీ పెండింగ్‌

  • దోబూచులాడుతున్న కీలక అధికారి

  • ఫైలును నీరుగార్చేందుకు ప్రయత్నం

  • అందుకు రెవెన్యూశాఖ ససేమిరా

  • దీంతో ఆదేశాలివ్వడంలో కావాలనే జాప్యం

  • శారదాపీఠానికి కోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వాలనేదీ జాప్యానికి మరో కారణం!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విశాఖ శారదాపీఠానికి తక్షణమే భూకేటాయింపులను ర ద్దుచేయాలని, ఇందుకు ఫైలు పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ఫైలు పంపింది. అయితే, రెండున్నర నెలలు ఆ ఫైలును పెండింగ్‌ పెట్టి వెనక్కి పంపారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చాక ముఖ్యమంత్రి సీరియస్‌ అయ్యారు. తాను ఆదేశించిన ఫైలును ఆపడం ఏమిటి? వెంటనే తిరిగి ఫైలు తెప్పించుకోండి అని సీఎం ఆదేశించారు. ఫైలు వచ్చింది. కానీ సేమ్‌ సీన్‌. మళ్లీ పెండింగ్‌. దీని వెనక సాములోరి శక్తులు బలంగా పనిచేస్తున్నాయా? లేక ముఖ్యమంత్రి ఆదేశాలను ధిక్కరించేంత సాహసం అధికారులకు వచ్చిందా అనేది తెలియదు. కానీ ఆ ఫైలు మళ్లీ పెండింగ్‌ పెట్టారు. కేవలం భూ కేటాయింపులను రద్దుచేయాలనే ప్రతిపాదించాలట! భూ కేటాయింపులో జరిగిన గోల్‌మాల్‌, అక్రమాలు, గూడుపుఠాణి, చీకటి పనుల ప్రస్తావన తీసుకు రావద్దంట! అది సీఎం దృష్టికి వెళ్తే ఎలా? అంతే ఫైలు పెండింగ్‌. పేరు ఇదే. కానీ అంతర్గత లక్ష్యం వేరేలా ఉంది.

వేగంగా నిర్ణయంం తీసుకోకుండా ఆలస్యం చేయడం ద్వారా సాములోరికి మేలు చేసే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. సోమవారం దాకా పెండింగ్‌ పెట్టి, అదే రోజు సాములోరు కోర్టుకు వెళ్లే అవకాశం క ల్పించడమే లక్ష్యంగా తోస్తోంది. దీనికోసం తెరవెనక కీలక అధికారి పెండింగ్‌ డ్రామా నడుపుతున్నారన్న అనుమానాలు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ హయాంలో విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద.... జగన్‌కు ఆత్మగా, రాజగువురుగా ఓ వెలుగు వెలిగారు. అందుకు ఉదాహరణే ఆ పీఠానికి భూ కేటాయింపు.


బీమిలీ మండలం కొత్త వలసలో 15 ఎకరాలు అప్పట్లో కేటాయించారు. అక్కడ ఎకరం బహిరంగ మార్కెట్‌ విలువ 15 కోట్లపైమాటే. రిజిస్ట్రేషన్‌ విలువ ఎకరాకు 1.89 కోట్లు. కాబట్ట, పీఠానికి ఎకరాకు 1.89 కోట్ల చొప్పున భూమిని కేటాయించవచ్చంటూ నాటివిశాఖ కలెక్టర్‌ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. జగన్‌కు సాములోరు రాజగురువు కదా! సాములోరు కోరినట్లుగా ఎకరా భూమిని లక్ష రూపాయల చొప్పున 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌మేనేజ్‌మెంట్‌ అథారిటీ( ఏపీఎల్‌ఎమ్‌ఏ)లో తీర్మానించారు. శారదా పీఠానికి ఓ ట్రస్టు ఉంటుంది. కాబట్టి ట్రస్టీ పేరిట ఓ వ్యక్తి శారదాపీఠానికి భీమిలీ మండలం కొత్త వలసలోని సరేనె ంబర్‌ 102లో ఉన్న 15 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ లేఖపై ఆఘమేఘాల మీద సర్కారు నిర్ణయాలు తీసుకుంది. కానీ, ఇప్పుడుఆ ఫైలును పరిశీలిస్తే, భూమి కేటాయింపు కోరుతూ వచ్చిన దరఖాస్తులో ట్రస్టీ పేరిట ఉన్న పేరు అసలు ట్రస్టు సభ్యుల జాబితాలో లేదు. అంటే, పీఠానికి ట్రస్టీ సభ్యుడు కాకున్నా, భూమి కేటాయింపును కోరుతూ లేఖ ఇచ్చారు. సర్కారు దాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఆ ట్రస్టీ కోరిక మేరకు భూమి కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం 2021, నవంబరు 29న జీఓ-343 జారీ చేసింది. ఈ జీఓలోని అంశాలకు ఆనాటి మంత్రివర్గ ఆమోదం ఉంది.


  • అంతా సాములోరి మహిమ

అయితే, ఆ తర్వాత సాములోరి ఆలోచనలు మారాయి. కొత్తవలసలోని సర్వేనెంబర్‌ 102లోనే మొత్తం భూమి వద్దని, అందులో కొంత తీసుకొని, మిగతా కొంత పక్క సర్వేనెంబర్‌లో తీసుకోవాలనుకున్నారు. అంతే, రెవెన్యూ అధికారులు సాములోరికి జై కొట్టారు. మంత్రివర్గం ఆమోదించిన కేటాయింపుల ఫైలుకు విరుద్దంగా, తమకు నచ్చిన సర్వే నెంబర్లలోని భూమిని పొందారు. దీనికి మంత్రివర్గ ఆమోదం లేదు. రెవెన్యూశాఖ కూడా ఆమోదం తీసుకోలేదు. సర్వేనెంబర్‌ 102-2లో 7.60 సెంట్లు, సర్వేనెంబర్‌ 103లో 7.30 సెంట్ల భూమిని పీఠానికి కేటాయిస్త్నుట్లు ఆనాటి రెవెన్యూశాఖ కార్యదర్శి సవరణ ఉత్తర్వులు 2022, ఫిబ్రవ రి 8న (జీఓ-64) జారీ చేశారు. అంటే, జీవో నం. 343లో పేర్కొన్న సర్వేనెంబర్లు మార్చారు. భూమిని మార్చారు. అంటే, కొత్తగా కేటాయింపులు ఉత్తర్వులు ఇచ్చారన్నమాట. దీనికి కూడా మంత్రివర్గ ఆమోదం కావాలి. కానీ, రెవెన్యూశాఖ అధికారి ఈ పనిచేయకుండా సైలెంట్‌గా తానే సర్వాధికారి అన్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చారు.


  • గుట్టురట్టవ్వకూడదనే పెండింగ్‌...

ఇంతటి అక్రమమైన కేటాయింపును రద్దుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ అంశాన్ని సహజవనరుల్లో భాగంగా భూముల అంశంపై విడుదల చేసిన శ్వేతపత్రంలోనూ ప్రస్తావించారు. ఆ భూ కేటాయింపును రద్దుచేస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ఫైలు పంపిస్తే దాన్ని ప్రభుత్వంలో కీలక అధికారి రెండున్నర నెలల పాటు తొక్కిపెట్టారు. కారణం ఏమంటే, భూ కేటాయింపు సమయంలో తన వ్యవహారం బయటకొస్తుందన్నది ఒక కారణం. సాములోరి పట్ల తనకున్న ప్రత్యేక స్వామిభక్తి బయటపడుతుందన్నది మరో భయం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ ఆ ఫైలును మరోసారి ప్రభుత్వానికి పంపించింది. సేమ్‌ సీన్‌. ఆ ఫైలును ఆ కీలక అధికారి మరోసారి పెండింగ్‌ పెట్టారు. రెవెన్యూశాఖ పంపించిన ఫైలులో ఉన్న అంశాలను ఆయన మార్చాలని కోరుతున్నారని తెలిసింది. సాములోరికి భూ కేటాయింపులో అప్పటి సీసీఎల్‌ఏ, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీఎల్‌ఎమ్‌ఏలో ఏం జరిగిందో ఫైలులో ప్రస్తావించవద్దని, కేవలం కేటాయింపును రద్దుచేస్తున్నట్లు, సాంకేతిక అంశాలనే కొనసాగించాలని ఆయన ఒత్తిడిచేస్తున్నట్లు తెలిసింది. దీనికి రెవెన్యూ శాఖ ససేమిరా అంటోంది. దీంతో ఫైలును ఆ అధికారి పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం.


  • కోర్టుకు వెళ్లే అవకాశం ఇచ్చేందుకా?

భూ కేటాయింపు రద్దు ఫైలుపై వెంటనే నిర్ణయం తీసుకోపోవడం వల్ల సాములోరికి మరో తెరవెనుక మేలు చేస్తున్నట్లుగా ఉందని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. శారదాపీఠం భూ కేటాయింపులు రద్దుచేయాల్సిందే అని సీఎం పట్టుబడుతున్నట్లుగా మీడియాలో వచ్చింది. కాబట్టి సర్కారు చర్యను అడ్డుకోవాలని సాములోరు కోర్టును ఆశ్రయించడానికి అవకాశం కల్పించడానికే పలు కారణాల పేరుతో ఫైలును ఆమోదించడంలో ఉద్దేశ్యపూర్వక ఆలస్యం చేస్తున్నారని తెలుగుదేశం వర్గాలు అనుమానిస్తున్నాయి. నిజానికి సీఎం ఆదేశాల మేరకు శుక్రవారమే ఉత్తర్వులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనావేశారు.కానీ అది జరగలేదు. శనివారం కూడా ఎలాంటి ఉత్తర్వురాలేదు. ఎందుకంటే ఆ ఫైలు ఆ కీలక అధికారే అట్టిపెట్టుకున్నారు. ఆదివారం సెలవు రోజు...ఉత్తర్వులు ఇవ్వలేరు. ఇక సోమవారమే ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం. అదే రోజున సాములోరు కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని ఓ సీనియర్‌ టీడీపీ నేత చెప్పారు.

Updated Date - Oct 20 , 2024 | 03:26 AM