ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu : బాబు ప్రమాణానికి వేగంగా ఏర్పాట్లు

ABN, Publish Date - Jun 09 , 2024 | 03:27 AM

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.

ఐదుగురు ఐఏఎస్‌లకు పర్యవేక్షణ బాధ్యత

జీఏడీ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు

12న ప్రమాణానికి లక్షమంది వస్తారని అంచనా

ఆ మేరకు ప్రధాన స్టేజీ నిర్మాణ పనులు

కేసరపల్లిలో పార్కింగ్‌ స్థలాల పరిశీలన

అమరావతి, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి)/గన్నవరం : ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఆయన ప్రమాణానికి ముహూర్తం ఖరారైంది. ఏర్పాట్ల పరిశీలనకు ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. బాబు.ఎ, ఎం.హరి జవహర్‌లాల్‌, కె.కన్నబాబు, సీహెచ్‌ హరికిరణ్‌, జీవీరపాండియన్‌లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు 11 ఎకరాల విస్తీర్ణంలో ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అవసరమైన మెటీరియల్‌ అంతా ఇప్పటికే సభాస్థలి వద్దకు చేరుకుంది. శనివారం సాయంత్రం నుంచి ప్రధాన స్టేజీ పనులు మొదలుపెట్టారు. గోకరాజు గంగరాజుకు చెందిన స్థలంతోపాటు మేధా టవర్స్‌, ఎన్టీఆర్‌ వెటర్నరీ కళాశాల, వాహన పటుత్వ కేంద్రం, కేసరపల్లి పెట్రోల్‌ బంక్‌ పక్క భూమి.. ఇలా పలు చోట్ల పార్కింగ్‌ స్థలాల కోసం పరిశీలన జరిపారు. సుమారు లక్షకు పైగా ప్రజలు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. 80 వేలు సిట్టింగ్‌ వేస్తున్నట్లు తెలిసింది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఇక్కడే పసుపు కుంకుమ బహిరంగ సభ జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, పెందుర్తి వెంకటేశ్‌, చింతమనేని ప్రభాకర్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ప్రమాణం ఉదయం 11.27 గంటలకే..

షెడ్యూల్‌ ప్రకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు 12వ తేదీ ఉదయం 11.27 గంటలకే ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ సీఎంవో అధికారులు ప్రమాణ స్వీకారం ఆ రోజు 9.27లకు ఉంటుందని తప్పుగా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. జరిగిన పొరపాటును తెలుసుకుని, ఆ పోస్టును సవరించారు.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 05:34 AM

Advertising
Advertising