ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu : మీ భూమి.. మీ హక్కు!

ABN, Publish Date - May 12 , 2024 | 04:29 AM

‘సీఎం జగన్‌ మీ భూమి మీకు ఇచ్చానంటున్నాడు. అలాగైతే మీ పాసు బుక్కుల మీద తన ఫొటో ఎందుకు వేయించుకున్నట్లు? ప్రజలంతా ఒకటి గుర్తు పెట్టుకోవాలి.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుతో యజమానులకు ఉరితాడే: చంద్రబాబు

ఒరిజినల్‌ డాక్యుమెంట్లు జగన్‌ వద్దే.. మనకేమో జిరాక్స్‌ ప్రతులిస్తారట

భూమి అమ్ముకోవాలంటే ఆయన అనుమతి కావాలి

పాస్‌పుస్తకాల మీద తన బొమ్మా?.. ప్రజలు తన బానిసలని అనుకుంటున్నారా?

నేను రాగానే టైటిలింగ్‌ యాక్టు రద్దు.. రైతుల ఫొటోలతో కొత్త పాస్‌పుస్తకాలు

సీమకు ఎవరు మంచి చేశారో చర్చకు సిద్ధమా?.. ఇది సంక్షేమానికి, సంక్షోభానికి యుద్ధం

టీడీపీది ఉద్యోగాలు కల్పించే పాలన.. వైసీపీది గంజాయి, డ్రగ్స్‌ పాలన

నడిపించే నేత కావాలా.. నరరూప రాక్షసుడు కావాలా.. ప్రజలే తేల్చుకోవాలి: బాబు

నంద్యాల/చిత్తూరు, మే 11 (ఆంధ్రజ్యోతి): ‘సీఎం జగన్‌ మీ భూమి మీకు ఇచ్చానంటున్నాడు. అలాగైతే మీ పాసు బుక్కుల మీద తన ఫొటో ఎందుకు వేయించుకున్నట్లు? ప్రజలంతా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు తీసుకొచ్చాక మీ భూమి మీది కాదంటాడు. ఈ యాక్టుతో భూ యజమానులందరికీ ఉరే’ అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఈ ఎన్నికలు సంక్షేమానికి, సంక్షోభానికి నడుమ యుద్ధమన్నారు. టీడీపీది ఉద్యోగాలు కల్పించే పాలన అయితే.. వైసీపీది గంజాయి, డ్రగ్స్‌ పాలన అని.. జగన్‌ విధ్వంస పాలనకు చరమ గీతం పాడి.. అభివృద్ధి పాలన కోసం టీడీపీకి ఓటేయాలని పిలుపిచ్చారు. ప్రజాగళం యాత్రతో రాష్ట్రమంతటా బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన.. శనివారం చిత్తూరు సభలో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. అంతకుముందు నంద్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలోనూ ప్రసంగించారు. భూ హక్కు చట్టంతో మన భూములకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లు జగన్‌ తన దగ్గర పెట్టుకుని.. మనకు జెరాక్స్‌ ప్రతులిస్తారని.. అవి చూపితే బ్యాంకులో డబ్బులివ్వరని.. చెల్లుబాటు కావని చంద్రబాబు అన్నారు. మన భూ రికార్డులన్నీ అమెరికాలో పెడతారని.. అమ్మాలంటే సైకో పర్మిషన్‌ కావాలన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ ఆఫీసర్‌దే పూర్తి నిర్ణయాధికారమని చెప్పారు. ‘ప్రజల భూములు ప్రజలకే దక్కాలి. అది వారి హక్కు. పాస్‌పుస్తకాల మీద రాజముద్ర ఉండాల్సిన చోట.. జగన్‌ తన బొమ్మ ఎందుకు వేయించుకుంటున్నారు? ప్రజలు తన బానిసలని అనుకుంటున్నారా? మళ్లీ ఆయనకు ఓటేస్తే మీ భూమి మీది కాదు. జగన్‌ మీ మెడకు ఉరి వేశాడు. మీరు ఫ్యానుకు ఉరి వేయండి. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించండి. ప్రజల ఆస్తులకే టెండరు పెట్టాలని చూస్తున్న సైకో గూబ గుయ్‌మనేలా ఓటువేయండి.. జగన్‌ను భూ స్థాపితం చేయండి’ అని పిలుపిచ్చారు. తాను అధికారంలోకి వచ్చాక జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తానని.. జగన్‌ ఫొటో ఉన్న పాసు పుస్తకాలను కూడా రద్దు చేసి ప్రభుత్వ రాజముద్ర ఉన్న కొత్త పుస్తకాలు ఇస్తానని పునరుద్ఘాటించారు. నడిపించే నాయకుడు కావాలో, నరరూప రాక్షసుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఇంకా ఏమన్నారంటే..


సామాన్యుల పరిస్థితేంటా?

సరిగ్గా ఏడు నెలల క్రితం నంద్యాలలో సభలో పాల్గొని విశ్రాంతి తీసుకుంటున్న నన్ను అర్ధరాత్రి పోలీసులు దొంగ కేసులుపెట్టి అరెస్టు చేసి తీసుకెళ్లారు. 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న తననే జగన్‌ అక్రమంగా అరెస్టు చేస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు రోజులూ ఆగితే సైకో పాలన అంతమవుతుంది. పోలింగ్‌ రోజున ఎండకు భయపడొద్దు. ఉదయం 6 గంటలకే నిద్ర లేచి 7 గంటలకే పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిపోండి. ఈ ప్రభుత్వానికి కట్టడం తెలియదు.. జగన్‌ వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చడంతో మొదలైన సైకో చేష్టలు ఐదేళ్లపాటు కొనసాగాయి. అమరరాజాను వేధించి పక్క రాష్ట్రానికి వెళ్లగొట్టారు. నేను అనుకుంటే భారతీ సిమెంట్స్‌ను వెళ్లగొట్టలేనా? అమరావతి ఒక్కటే రాజఽధాని. దానిని అభివృద్ధి చేస్తాం. పోలవరం పూర్తిచేస్తాం. దొంగలను పట్టుకుని అవినీతిపరులను శిక్షిస్తాం. మనం వచ్చామంటే పరిశ్రమలు అవే వస్తాయి.

చెల్లెలు అడుగుతున్నా చెప్పరేం?

చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపిందెవరో చెప్పాలని సొంత చెల్లెలు అడుగుతున్నా జగన్‌ చెప్పడం లేదు. కనీసం ప్రజలకైనా జవాబు చెబుతారా? ప్రజలకుకావలసింది సంక్షేమం. అది టీడీపీ తీసుకొస్తుంది. ప్రజల కోసం ఉమ్మడిగా మేనిఫెస్టో తెచ్చాం. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక తర్వాత సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి అందరికీ పంచుతా. నేనొస్తే సంక్షేమ పథకాలు రద్దవుతాయని ప్రచారం చేస్తున్నారు. జగన్‌ కంటే రెండింతల సంక్షేమ పథకాలు తెచ్చే బాధ్యత నాది.


నేనూ సీమ బిడ్డనే..

కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌. నేను వచ్చాక వీటి కోసం రూ.65 వేల కోట్లు ఖర్చు చేశాను. నేను కూడా రాయలసీమ బిడ్డనే. సీమకు ఎవరు మంచి చేశారో.. ఎవరు చెడు చేశారో చర్చించడానికి సిద్ధమా. జగన్‌ రాయలసీమలో బలిజలకు, కమ్మలకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. రాజంపేట, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో కూటమి తరఫున బలిజలకు అవకాశమిచ్చాం. వైసీపీ వాళ్లు కమ్మవారికి ఇవ్వకున్నా నేను రెడ్లకు ఇచ్చాను. ఎవరు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించినా దాడులు చేశారు. పోలీసులు అర్ధరాత్రిళ్లు గోడలు దూకి అరెస్టులు చేసేవారు. ఇప్పుడు రాష్ట్రం తిరగబడింది. 40 ఏళ్లలో ఎప్పుడూచూడని గాలి కూటమి వైపువీస్తోంది.

హైకోర్టుకు వెళ్లమన్నారు..

భూ హక్కు చట్టం వల్ల ఇబ్బందుల పాలైన బాలహాజీ అనే ఓ లాయర్‌తో చంద్రబాబు నంద్యాల సభలో మాట్లాడించారు. తనకు ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో 63 సెంట్ల భూమి ఉందని, అయితే భూ హక్కు చట్టం వచ్చాక ఆ భూమి తన పేరిట లేకుండా పోయిందని బాలహాజీ తెలిపారు. ‘ఈ విషయమై స్థానిక తహసీల్దారుకు వివరిస్తే ఉన్నతాధికారులను కలవాలన్నారు. ఆర్డీవో, డీఆర్వో, జాయింట్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ను కలిసి నా బాధ చెప్పుకొంటే.. 2023 నవంబరు నాటికే ఈ చట్టం వచ్చేసిందన్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. నాలాంటి లాయర్‌కే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే, ఇక సామాన్యుల సంగతి ఏమిటి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - May 12 , 2024 | 05:23 AM

Advertising
Advertising