ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చౌకగా చీప్‌ లిక్కర్‌..!

ABN, Publish Date - Sep 19 , 2024 | 04:06 AM

ప్రజలకు మద్యం ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో చీప్‌ లిక్కర్‌ను చౌకగా అందించాలని, నాసిరకం బ్రాండ్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

నాణ్యత లేని లిక్కర్‌ బ్రాండ్లకు చెల్లుచీటీ

రాష్ట్రంలో 12 ఎలైట్‌ షాపులకు గ్రీన్‌సిగ్నల్‌

షాపు పక్కనే వాక్‌ ఇన్‌ స్టోర్‌కు అనుమతి

లైసెన్సు ఫీజులు 50 నుంచి 85 లక్షలు

త్వరలోనే మద్యం పాలసీకి నోటిఫికేషన్‌

అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మద్యం ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో చీప్‌ లిక్కర్‌ను చౌకగా అందించాలని, నాసిరకం బ్రాండ్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరిహద్దు రాష్ర్టాల్లోని ధరలపై అధ్యయనం చేసి.. అక్కడి ధరల ఆధారంగా ఇక్కడ సగటు ధర పెట్టాలని భావించింది. చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ సీసా ధరలు తెలంగాణలో రూ.140, కర్ణాటకలో రూ.80, తమిళనాడులో రూ.90, ఒడిశాలో రూ.90గా ఉన్నందున వాటి సగటును పరిగణనలోకి తీసుకుని ఏపీలో క్వార్టర్‌ రూ.99గా ఉండాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన బ్రాండ్లను తొలగించి, వాటి స్థానంలో గతంలో ఉన్న పాపులర్‌ బ్రాండ్లను ప్రవేశపెట్టనుంది. సాధారణ లిక్కర్‌ షాపులతో పాటు కేవలం ప్రీమియం రకం మద్యం బ్రాండ్లు దొరికే ఎలైట్‌ షాపులకూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 ఎలైట్‌ షాపుల ప్రారంభానికి అనుమతివ్వనుంది. తిరుపతిలో మాత్రం ఈ షాపునకు అనుమతి ఇవ్వరు. అలాగే లైసెన్సీలు వారి షాపుల పక్కన వాక్‌ ఇన్‌ స్టోర్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం లైసెన్సీలు అదనంగా రూ.5 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. డ్రాట్‌ బీరు తయారు చేసి, విక్రయించే మైక్రో బ్రూవరీలకు మళ్లీ అనుమతివ్వనున్నారు. మైక్రో బ్రూవరీల్లో అప్పటికప్పుడు బీరును తయారుచేసి విక్రయిస్తారు. మైక్రో బ్రూవరీ ఏర్పాటు చేసుకునే వారు బార్‌తో సమానంగా లైసెన్సు ఫీజు చెల్లించాలి. కొత్త మద్యం పాలసీకి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం లభించడంతో త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. కేబినెట్‌ ఆమోదంపై తీర్మానం వచ్చిన వెంటనే ఎక్సైజ్‌ చట్టంలో సవరణకు ఆర్డినెన్స్‌ ఫైలును రాజ్‌భవన్‌కు పంపనుంది. ఆర్డినెన్స్‌ జారీ అయిన వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సెప్టెంబరు నెలాఖరుతో ప్రభుత్వ షాపుల పాలసీ ముగుస్తున్నందున కొత్త పాలసీ అమలుకు గడువు సరిపోదనే వాదన వినిపిస్తోంది. అక్టోబరు మొదటి వారంలో ప్రైవేటు షాపుల పాలసీని అమల్లోకి తెచ్చేలా షెడ్యూలు రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. తొలుత 3,396 షాపులకు నోటిఫికేషన్‌ ఇస్తారు. ఆ తర్వాత గీత కార్మికుల కోసం అందులో 10శాతం అంటే 340 షాపులకు విడిగా నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.

షాపుల లైసెన్సు ఫీజులను భారీగా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన కనీసం రూ.50లక్షల నుంచి రూ.85లక్షల వరకు ఫీజులు పెట్టనుంది. ఎలైట్‌ షాపుల లైసెన్స్‌ ఫీజు రూ.కోటిగా ఉండనుంది. అయితే వీటికి కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. ఏటా 10శాతం లైసెన్స్‌ ఫీజు పెంచుతారు. షాపుల దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రతి మద్యం కంపెనీ కనీసం ఒక బ్రాండ్‌ను తక్కువ ధరతో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం మరో నిబంధన పెట్టనుంది.

Updated Date - Sep 19 , 2024 | 04:06 AM

Advertising
Advertising