income-వరసిద్ధుడి ఆలయానికి రూ.23.54 లక్షల ఆదాయం
ABN, Publish Date - Nov 05 , 2024 | 01:23 AM
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి శనివారం నిర్వహించిన టెండర్ల ద్వారా రూ.23,54,759 ఆదాయం లభించింది. ఆలయ ఈవో కార్యాలయ భవనం వద్ద బహినంగ వేలం, సీల్డ్, ఆన్‌లైన్ టెండర్లు నిర్వహించినట్లు ఈవో గురుప్రసాద్ తెలిపారు.
ఐరాల(కాణిపాకం), నవంబరు 4 (ఆంధ్రజ్యోతి):కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి శనివారం నిర్వహించిన టెండర్ల ద్వారా రూ.23,54,759 ఆదాయం లభించింది. ఆలయ ఈవో కార్యాలయ భవనం వద్ద బహినంగ వేలం, సీల్డ్, ఆన్‌లైన్ టెండర్లు నిర్వహించినట్లు ఈవో గురుప్రసాద్ తెలిపారు. భక్తుల పాదరక్షలను భద్రపరిచే హక్కును ఏడాది కాల పరిమితితో సీల్డ్ టెండర్ దారుడు హెచ్చుగా కోడ్ చేయడంతో అతనికి హక్కు దక్కినట్టు ఈవో తెలిపారు. కల్యాణ కట్ట వద్ద బంకు నిర్వహణకు, గోమయం సేకరించే లైసెన్స్‌కు ఎవ్వరూ పాల్గొన లేదన్నారు. త్వరలో వీటికి వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ఎస్వీ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ బాలరంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 05 , 2024 | 01:23 AM