ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rabi season-రబీ సీజన్‌లో రూ.2830 కోట్ల రుణాలు

ABN, Publish Date - Dec 05 , 2024 | 01:29 AM

రబీ సీజన్‌లో రూ.2830 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ హరీష్‌ తెలిపారు. రుణాల మంజూరుకు ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలు జారీచేశామన్నారు.

ఎల్డీఎం హరీష్‌

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌లో రూ.2830 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ హరీష్‌ తెలిపారు. రుణాల మంజూరుకు ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలు జారీచేశామన్నారు. ఖరీ్‌ఫలో రూ.4072 కోట్ల రుణాల లక్ష్యానికి గానూ రూ.4437 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు.వ్యవసాయ అనుబంధ రుణాలపై హరీష్‌తో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.

ఫ బీమా వద్దంటే రాసివ్వాలి

ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన కింద పంట నష్టానికి రైతులు బీమా పొందవచ్చు. బ్యాంకులో రుణాలు తీసుకుంటే రైతులతో బీమా కట్టించే బాధ్యత సంబంధిత అధికారులదే. రుణం తీసుకోని వారు నేరుగా బ్యాంకులు, సీఎస్సీ బీమా సంస్థ వద్దే కట్టాలి. బీమా వద్దంటే రాతపూర్వకంగా తెలియజేయాలి. ప్రధానమైన వరిపంటకు ఎకరానికి రూ.84, వేరుశెనగపంటకు రూ.60 చెల్లించాలి.ఈ నెలాఖరులోగా బీమా నగదు చెల్లించాలి.

ఫ జిల్లా రుణలక్ష్యం రూ.16,317.64 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.16,317.64 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సెప్టెంబరు నాటికి రూ.6698.29 కోట్లు ఇవ్వాలని లక్ష్యం నిర్ణయించగా, అంతకుమించి రూ.7620.26 కోట్లు ఇచ్చాం. 2025 మార్చి 31 నాటికి లక్ష్యాలను చేరుకుంటాం. ఇందులో ప్రాధాన్యతారంగాలకు రూ.13,396.46 కోట్లు (82.10శాతం), వ్యవసాయ రంగానికి రూ.10,976.27 కోట్లు (67.27శాతం) కేటాయించాం. పంటరుణాల రూపేణా ఖరీఫ్‌, రబీ కాలానికి 3,71,198మంది రైతులకు రూ.6,901.74 కోట్లు (42.30శాతం) రుణప్రణాళికలు పొందుపరిచాం. ప్రాధాన్యేతర రంగాలకు రూ.2921.19 కోట్లు కేటాయించాం.

ఫ టిడ్కోకు నిలిచిన రికవరీలు

టిడ్కో ఇళ్ళకు సంబంధించి 18 నెలలుగా రికవరీలు నిలిచిపోయాయి. గత ఏడాది చిత్తూరు నగరంలో 515 మందికి రూ.14.26 కోట్లు రుణాలు మంజూరు చేశాం. ప్రస్తుతం వీటిలో ఎన్‌పీఏలు (నిరర్థక ఆస్తులు) పెరిగిపోయాయి. ప్రస్తుతం వ్యక్తిగత ఇండ్లకు రుణాలు ఇస్తున్నాం.

ఫ తోడు పథకం నిలిపివేత

పీఎంఈజీపీ పథకానికి 35 శాతం సబ్సిడీ ఉండడంతో ఎక్కువమంది దానిపై మొగ్గు కనబరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గత వైసీపీ ప్రభుత్వం అమలుచేసిన జగనన్న తోడు పథకం ఇప్పటికే నిలిచిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది.చిరు వ్యాపారులకిచ్చే స్వానిధి పథకం అర్బన్‌లో కూడా అమలవుతోంది. ముద్రాయోజన కింద శిశు, కిశోర్‌, తరుణ్‌ పథకాల్లో రుణాల మంజూరు జరుగుతోంది. తరుణ్‌ పథకానికి మాత్రం గతంలో రుణపరిమితి రూ.10లక్షలే వుండగా ప్రస్తుతం రూ.20లక్షలకు పెంచారు.

ఫ ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.1589 కోట్ల రుణం

ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 23,966 స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు) రూ.1589 కోట్ల రుణాలను అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించాం. మున్సిపాలిటీల్లో మూడు వేల ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.120 కోట్ల మేర రుణం పంపిణీ చేయాలని వార్షిక ప్రణాళికలో పొందుపరిచాం. గత ఆర్థిక సంవత్సరంలో 20,790 ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.948.81 కోట్లు పంపిణీ చేయాలన్న లక్ష్యం పెట్టుకోగా అంతకుమించి 21,412 గ్రూపులకు రూ.2343.03 కోట్లు రుణాలిచ్చి జిల్లాను ముందంజలో ఉంచాం.

Updated Date - Dec 05 , 2024 | 01:29 AM