ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

python - కలెక్టర్‌ బంగ్లాలో కొండచిలువ

ABN, Publish Date - Oct 24 , 2024 | 01:32 AM

విడవకుండా కురుస్తున్న వర్షాలతో ఇబ్బంది పడ్డ ఓ కొండచిలువ కలెక్టర్‌ బంగ్లాకు చేరి హల్‌చల్‌ చేసింది. పలుశాఖల అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి ఐదు గంటలు కష్టపడి రిజర్వుఫారెస్టులో వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): విడవకుండా కురుస్తున్న వర్షాలతో ఇబ్బంది పడ్డ ఓ కొండచిలువ కలెక్టర్‌ బంగ్లాకు చేరి హల్‌చల్‌ చేసింది. పలుశాఖల అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి ఐదు గంటలు కష్టపడి రిజర్వుఫారెస్టులో వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కలెక్టర్‌ బంగ్లాకు చేరుకున్న ఆరడుగుల కొండచిలువ అక్కడి వేపచెట్టు పైభాగానికి వెళ్ళి ఒళ్ళు ముడుచుకుని పడుకుంది. చెట్టెక్కిన కొండచిలువను సిబ్బంది గుర్తించి కేకలు వేశారు. అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.స్నేక్‌ కేచర్‌ ప్రేమ్‌తో కలిసి అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చెట్టు కొమ్మలు కత్తిరించి, టార్చ్‌లైట్‌ వెలుగులో కొండచిలువను చాకచక్యంగా ఒడిసిపట్టుకుని కిందకు చేర్చారు. ఈ తతంగం అర్ధరాత్రి ఒంటిగంట దాకా సాగింది. ఆ తర్వాత దానిని బుధవారం ఉదయం సమీపంలోని రిజర్వు ఫారె్‌స్టలో వదిలేశారు.

Updated Date - Oct 24 , 2024 | 01:32 AM