Triple IT ట్రిపుల్ ఐటీలకు నూతన రిజిస్ట్రార్‌గా పూతలపట్టు వాసి
ABN, Publish Date - Sep 12 , 2024 | 02:58 AM
ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలకు నూతన రిజిస్ట్రార్‌గా సండ్ర అమరేంద్ర కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈయనది పూతలపట్టు మండలంలోని కమ్మగుట్టపల్లె గ్రామం.
పూతలపట్టు, సెప్టెంబర్ 11: ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలకు నూతన రిజిస్ట్రార్‌గా సండ్ర అమరేంద్ర కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈయనది పూతలపట్టు మండలంలోని కమ్మగుట్టపల్లె గ్రామం. ప్రస్తుతం కడప జిల్లా ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటులో రెగ్యులర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. బిట్స్ పిలానిలో ఈయన పీహెచ్‌డీ చేశారు. ఈయన నియామకం పట్ల మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Sep 12 , 2024 | 07:01 AM