ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

collided- ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఇసుక ట్రాక్టర్‌

ABN, Publish Date - Oct 24 , 2024 | 01:52 AM

ద్విచక్ర వాహనాన్ని ఇసుక ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఐదేళ్ల కొడుకు సహా తండ్రి మృతి చెందగా తల్లి చికిత్స పొందుతోంది. ఈ ఘటన బుధవారం రాత్రి శ్రీకాళహస్తి మండలం దొమ్మరపాళెం వద్ద కాసరం రహదారిపై జరిగింది.

చైతన్య (ఫైల్‌ ఫొటో)

ఫ ఐదేళ్ల కొడుకు సహా తండ్రి మృతి

ఫ తల్లికి తీవ్రగాయాలు

ఫ చియ్యవరంలో విషాదం

శ్రీకాళహస్తి, అక్టోబరు 23: ద్విచక్ర వాహనాన్ని ఇసుక ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఐదేళ్ల కొడుకు సహా తండ్రి మృతి చెందగా తల్లి చికిత్స పొందుతోంది. ఈ ఘటన బుధవారం రాత్రి శ్రీకాళహస్తి మండలం దొమ్మరపాళెం వద్ద కాసరం రహదారిపై జరిగింది. శ్రీకాళహస్తి రూరల్‌ సీఐ రవినాయక్‌ తెలిపిన ప్రకారం.. తొట్టంబేడు మండలం చియ్యవరానికి చెందిన రాజేంద్రన్‌(35) రైతు. బుధవారం రాత్రి శ్రీకాళహస్తి పట్టణంలో పనులు ముగించుకుని భార్య గుర్రమ్మ, కుమారుడు చైతన్య(5)తో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. దొమ్మరపాళెం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఇసుక ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడగా, గుర్రమ్మ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చైతన్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రగాయాలతో విషమ పరిస్థితిలో ఉన్న రాజేంద్రను బంధువులు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. గుర్రమ్మ ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రూరల్‌ పోలీసులు మృతదేహాలను ఏరియా ఆస్పత్రి మార్చురీకితరలించారు. ఇసుక ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ రవినాయక్‌ తెలిపారు.

Updated Date - Oct 24 , 2024 | 06:39 AM