ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మునిరాజమ్మకు ప్రత్యేక ఆహ్వానం

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:33 AM

వైసీపీ అరాచకాలను ప్రతిఘటించి పోరాడిన రజక మహిళ మునిరాజమ్మ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు.

మునిరాజమ్మ

శ్రీకాళహస్తి, జూన్‌ 11: వైసీపీ అరాచకాలను ప్రతిఘటించి పోరాడిన రజక మహిళ మునిరాజమ్మ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణం శివారు రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన మునిరాజమ్మకు అక్కడే ఇంటి స్థలం ఉంది. సమీపంలో చిన్నపాటి టిఫిన్‌ సెంటర్‌ నిర్వహించేది. అక్కడ ఆమె స్థలంలో ఇల్లు నిర్మించుకునే సమయంలో కొందరు వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టారు. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం నెలల తరబడి ప్రాఽధేయపడగా రూ.20వేలు ఇస్తే కనెక్షన్‌ ఇస్తామంటూ అధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో టీడీపీ యువనేత నారా లోకేష్‌ పాదయాత్రలో భాగంగా గత యేడాది ఫిబ్రవరి 17వ తేదీన శ్రీకాళహస్తి మీదుగా సాగారు. రాజీవ్‌నగర్‌ కాలనీ వద్ద మునిరాజమ్మ నారా లోకేష్‌ను కలిసి తన సమస్యను విన్నవించారు. దీంతో మూడు రోజుల తరువాత కొందరు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మునిరాజమ్మ టిఫిన్‌సెంటర్‌ వద్దకు చేరుకుని చిల్లర పేరుతో గొడవ చేశారు. టిఫిన్‌ దుకాణంలో పాత్రలను విసిరి కొట్టి భయాందోళనకు గురి చేశారు. అంతటితో ఆగకుండా రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదు చేశారు.టీడీపీ నాయకుడు బొజ్జల సుధీర్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు మునిరాజమ్మకు అండగా నిలిచారు. ఆ తరువాత చంద్రగిరిలో నారా లోకేష్‌ నేతృత్వంలో జరిగిన రజక సమావేశంలో మునిరాజమ్మ పాల్గొని లోకేష్‌ను కలిసినందుకు తనను వైసీపీ నేతలు ఎంతగా ఇబ్బందులకు గురిచేశారో వివరించారు. టీడీపీ అండగా ఉండడంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి ఉపాధి కల్పిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. ఆ తరువాత ఆమెను ఫోన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దుర్భాషలాడటం జరిగింది. మళ్లీ ఆమె స్థానిక టీడీపీ నేతల సాయంతో విజయవాడలో చంద్రబాబును కలిసి వైసీపీ అరాచకాలను వివరించారు. వెంటనే ఆయన రూ.5లక్షల ఆర్ధికసాయాన్ని మునిరాజమ్మకు అందజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇటీవల ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన చంద్రబాబు బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే.మునిరాజమ్మకు టీడీపీ నుంచి ప్రత్యేక ఆహ్వానం పంపారు.

అదృష్టంగా భావిస్తున్నా

చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు,లోకేష్‌, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆయన తల్లి బృందమ్మ రుణం తీర్చుకోలేను. రాష్ట్రానికి వైసీపీ నుంచి విముక్తి కలగాలని గంగమ్మ తల్లికి మొక్కాను.ఎట్టకేలకు ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు. రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయి. ప్రజలందరూ సంతోషంగా జీవిస్తారు.

- మునిరాజమ్మ

Updated Date - Jun 12 , 2024 | 12:33 AM

Advertising
Advertising