ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మరోసారి టీచర్ల సర్దుబాటు

ABN, Publish Date - Nov 15 , 2024 | 01:58 AM

మరోసారి టీచర్ల సర్దుబాటు చేయడానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రెండు నెలల వ్యవధిలో రెండోసారి ఈ ప్రక్రియ చేపట్టనుంది. డీఎస్సీ ద్వారా పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్న క్రమంలో వర్క్‌ అడ్జస్ట్మెంట్‌ చేస్తే కొత్తగా వచ్చే టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు సులభమవుతుందని ప్రభుత్వం భావించింది.

డీఈవో కార్యాలయం

కొత్త జిల్లా ప్రాతిపదికగా చేపట్టనున్న ప్రక్రియ

చిత్తూరు సెంట్రల్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మరోసారి టీచర్ల సర్దుబాటు చేయడానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రెండు నెలల వ్యవధిలో రెండోసారి ఈ ప్రక్రియ చేపట్టనుంది. డీఎస్సీ ద్వారా పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్న క్రమంలో వర్క్‌ అడ్జస్ట్మెంట్‌ చేస్తే కొత్తగా వచ్చే టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు సులభమవుతుందని ప్రభుత్వం భావించింది. ఆమేరకు జిల్లా శాఖ అధికారులకు సూచనలు జారీ చేసింది. పదవీ విరమణ, మరణించిన వారి స్థానాలను భర్తీ చేయడంతోపాటు విద్యార్థి, టీచర్ల నిష్పత్తి ఆధారంగా తీసుకోనున్నారు. ఈ సర్దుబాటును కొత్త జిల్లా ప్రాతిపదికనే చేపట్టనున్నారు.

7639 మంది టీచర్లు

జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మున్సిపల్‌ పాఠశాలలు 2,420 ఉన్నాయి. ఇందులో 1,946 ప్రాథమిక, 158 ప్రాథమికోన్నత, 316 ఉన్నత పాఠశాలలున్నాయి. 7,639 మంది టీచర్లు ఉన్నారు. వీరిలో.. ఎస్జీటీలు 3576, స్కూల్‌ అసిస్టెంట్లు 3631, ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎంలు 192, హైస్కూల్‌ హెచ్‌ఎంలు 219, పీఈటీ, డ్రాయింగ్‌, క్రాఫ్టు కేటగిరిలకు చెందిన 21 మంది ఉన్నారు.

తాజాగా 350 మంది సర్దుబాటు?

సెప్టెంబరులో 462 ఖాళీలకు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. ఇందులో ఎస్జీటీలు 332 మంది ఉండగా, స్కూల్‌ అసిస్టెంట్లు 130 మంది ఉన్నారు. తాజాగా ఈనెలలో 350 మంది టీచర్ల సర్దుబాటు చేపట్టనున్నారు. ఇందులో ఎస్జీటీలు 330, స్కూల్‌ అసిస్టెంట్‌ 20 ఖాళీలు ఉన్నాయి.

తొలుత మండల స్థాయి నుంచే..

తొలుత జిల్లా స్థాయిలో డీఈవో లాగిన్‌ నుంచి సర్దుబాటు చేయాలని భావించినా, చివరికి గతంలో మాదిరిగానే టీచర్ల సర్దుబాటు చేపట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో తొలుత మండల స్థాయి, ఆపై డివిజన్‌, జిల్లా స్థాయిలో చేపట్టనున్నారు.

Updated Date - Nov 15 , 2024 | 01:58 AM