ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐతేపల్లె.... ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ

ABN, Publish Date - Nov 21 , 2024 | 01:11 AM

మహిళలకు మరింత తోడ్పాటు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. ఇందులో భాగంగా మహిళా స్నేహపూర్వక పంచాయతీల (ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాయి.

చంద్రగిరి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహిళలకు మరింత తోడ్పాటు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. ఇందులో భాగంగా మహిళా స్నేహపూర్వక పంచాయతీల (ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాయి. దీనికోసం జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో 26 పంచాయతీలను ఎంపిక చేశాయి. అందులో తిరుపతి జిల్లా నుంచి చంద్రగిరి మండలం ‘ఐతేపల్లి’ ఉంది. 1924 మంది జనాభా కలిగిన ఈ పంచాయతీకి సర్పంచిగా ఫాజిల్లా వ్యవహరిస్తుండగా, 10 మంది వార్డు సభ్యులూ మహిళలే ఉన్నారు. ఈ కార్యక్రమం కింద పంచాయతీలో మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేలా వారి భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలు సమకూరుస్తారు. విద్య, వైద్యం, స్వయం ఉపాధి వంటి పథకాల అమలుకు పెద్దపీట వేస్తారు. ఇళ్ల నుంచి విధిగా చెత్తసేకరణ, ఘనవ్యర్థాల నిర్వహణకు ప్రాముఖ్యం ఉంటుంది. బాల్య వివాహాలు, శిశుమరణాల నియంత్రణకు చర్యలు చేపడతారు. వ్యసనాలు లేని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారు.

Updated Date - Nov 21 , 2024 | 01:11 AM