ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైభవంగా అమ్మవారి జలావాసం

ABN, Publish Date - May 24 , 2024 | 12:50 AM

కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మంగళ, బుధవారాల్లో ఘనంగా జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటాక.. గురువారం తెల్లవారుజామున అమ్మవారి జలావాస ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించారు.

ఊరేగింపుగా తరలివెళ్తున్న గంగమ్మ

కుప్పం, మే 23: కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మంగళ, బుధవారాల్లో ఘనంగా జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటాక.. గురువారం తెల్లవారుజామున అమ్మవారి జలావాస ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. బుధవారం ఉదయంనుంచి అర్ధరాత్రి దాకా ఆలయంలో గంగమాంబ అమ్మవారు భక్తులకు విశ్వరూప దర్శనం ప్రసాదించారు. భక్తజనం తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధల మధ్య మొక్కులు తీర్చుకున్నారు. గురువారం తెల్లవారుజాము అవుతుండగా పూజలు, ప్రత్యేక శాంతి పూజల మధ్య అమ్మవారి సంపూర్ణ రూపంనుంచి ఆమె శిరస్సును తొలగించారు. మిగిలిన మొండేన్ని తిరిగి తెర వెనుకకు చేర్చారు. అమ్మవారి శిరస్సును ఆర్టీసీ బస్టాండు ఆవరణలో గంగబావి వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఇక్కడ అమ్మవారిని కింది దించి విశేష పూజలు చేశారు. అనంతరం గంగమాంబ అమ్మవారిని జలావాసం చేయించారు. ఈ జలావాస ఘట్టంతో అమ్మవారి జాతర ఉత్సవాలు సంపూర్ణమయ్యాయి.

Updated Date - May 24 , 2024 | 12:50 AM

Advertising
Advertising