ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇక ప్రశ్నపత్రాలన్నీ పోలీసు స్టేషన్‌ నుంచే తీసుకోవాలి

ABN, Publish Date - Dec 17 , 2024 | 02:03 AM

ప్రశ్నపత్రాలను ఇకపై సమీప పోలీసు స్టేషన్‌ (పీఎ్‌స)లో డిపాజిట్‌ చేసి, పరీక్షల సమయంలో తీసుకోవాలని ఆర్జేడీ శామ్యూల్‌ ఆదేశాలు జారీ చేశారు. డీఈవో కార్యాలయంలో సోమవారం నుంచి మూడ్రోజులపాటు చేపట్టే తనిఖీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన పలు అంశాలను మీడియాకు వివరించారు. ప్రస్తుతం సమ్మెటివ్‌ అసిస్మెంట్‌-1 పరీక్షల్లో భాగంగా ఆదివారం యూట్యూబ్‌లో గణితం సబ్జెక్టు పేపర్లు లీక్‌ కావడంతో కమిషనర్‌ ఆదేశాల మేరకు 6వ తరగతి నుంచి టెన్త్‌ వరకు పరీక్షను వాయిదా వేసినట్లు తెలిపారు. దీనిపై విజయవాడలో కమిషనర్‌ స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తనిఖీలయ్యాక నివేదికలను కమిషనర్‌కు పంపుతామన్నారు.

సిబ్బందితో సమావేశమైన ఆర్జేడీ శామ్యూల్‌

ప్రభుత్వ పాఠశాలల్లో గైడ్లను ప్రోత్సహించొద్దు

ఆర్జేడీ శామ్యూల్‌ ఆదేశాలు

చిత్తూరు సెంట్రల్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నపత్రాలను ఇకపై సమీప పోలీసు స్టేషన్‌ (పీఎ్‌స)లో డిపాజిట్‌ చేసి, పరీక్షల సమయంలో తీసుకోవాలని ఆర్జేడీ శామ్యూల్‌ ఆదేశాలు జారీ చేశారు. డీఈవో కార్యాలయంలో సోమవారం నుంచి మూడ్రోజులపాటు చేపట్టే తనిఖీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన పలు అంశాలను మీడియాకు వివరించారు. ప్రస్తుతం సమ్మెటివ్‌ అసిస్మెంట్‌-1 పరీక్షల్లో భాగంగా ఆదివారం యూట్యూబ్‌లో గణితం సబ్జెక్టు పేపర్లు లీక్‌ కావడంతో కమిషనర్‌ ఆదేశాల మేరకు 6వ తరగతి నుంచి టెన్త్‌ వరకు పరీక్షను వాయిదా వేసినట్లు తెలిపారు. దీనిపై విజయవాడలో కమిషనర్‌ స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తనిఖీలయ్యాక నివేదికలను కమిషనర్‌కు పంపుతామన్నారు.

20న గణిత పరీక్ష

వాయిదా పడ్డ గణిత పరీక్షను ఈనెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు ఆర్జేడీ తెలిపారు. జిల్లాలో వర్షాల కారణంగా ఈనెల 12, 13 తేదీల్లో జరగాల్సిన హిందీ, ఇంగ్లీష్‌ పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. మంగళవారం నుంచి జరగాల్సిన ఫిజిక్స్‌, బయాలజీ, సోషియల్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను సోమవారం రాత్రికి మండలాల్లోని సమీప పోలీసు స్టేషన్‌లో డిపాజిట్‌ చేయనున్నట్లు వివరించారు. నిర్ణయించిన సమయానికి ప్రశ్నపత్రాలను పీఎస్‌ నుంచి తీసుకోవాలని డీఈవో, డీవైఈవో, ఎంఈవో, హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పరీక్షల నిర్వహణలో ఉమ్మడి జిల్లా పరీక్షల విభాగం కీలక పాత్ర పోషించాలని సూచించారు. టెన్త్‌ విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించేలా వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. హెచ్‌ఎంలు గైడ్స్‌ను పాటించాలని ప్రోత్సహించడం సరికాదని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రభుత్వ ప్రశ్నపత్రాన్ని అనుసరించే చర్యలు చేపడతామన్నారు. అంతకుముందు కమిషనరేట్‌ నుంచి సమ్మెటివ్‌ పరీక్షల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈవో వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, డీవైఈవో చంద్రశేఖర్‌, డీసీఈబీ కార్యదర్శి పరశురాం తదితరులతో కలిసి ఆర్జేడీ పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2024 | 02:03 AM