rains వర్షాలతో అప్రమత్తంగా ఉండండి
ABN, Publish Date - Sep 02 , 2024 | 02:29 AM
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఆపరేషన్ డివిజన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తడిసిన కరెంటు స్తంభాలు ముట్టుకోవద్దన్నారు.
ప్రజలకు ట్రాన్స్‌కో ఈఈ సూచన
చిత్తూరు రూరల్, సెప్టెంబరు 1: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఆపరేషన్ డివిజన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తడిసిన కరెంటు స్తంభాలు ముట్టుకోవద్దన్నారు. రైతులు తడి చేతులతో స్టార్టర్లను, మోటార్లను తాకరాదని సూచించారు. విద్యుత్ లైనుకు తగులుతున్న చెట్లను ముట్టుకోవద్దన్నారు. పార్కులు, స్టేడియాల్లో విద్యుత్ లైటు స్తంభాలను పట్టుకోవడం లాంటివి చేయకూదని పేర్కొన్నారు. పిల్లలను కరెంటు వస్తువులకు దూరంగా ఉంచాలన్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం వచ్చేటప్పుడు డిష్ కనెక్షన్, టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ఫ్యూజు పోయినప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేయాలే తప్పా రైతులే వేసే ప్రయత్నం చేయరాదన్నారు.
Updated Date - Sep 02 , 2024 | 02:29 AM