BJP: వైసీపీ నేతల ఒత్తిడితోనే తిరుపతి ఎస్పీని బదిలీ చేశారు: భానుప్రకాష్ రెడ్డి
ABN, Publish Date - Mar 04 , 2024 | 01:56 PM
తిరుపతి: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజాయితీగా పనిచేయాలంటే ఏపీలో సాధ్యం కాదని.. తిరుపతి ఎస్పీ మల్లికా గార్గేని 20 రోజుల్లో ఎందుకు బదిలీ చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుపతి: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై బీజేపీ (BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజాయితీగా పనిచేయాలంటే ఏపీ (AP)లో సాధ్యం కాదని.. తిరుపతి ఎస్పీ (Tirupati SP) మల్లికా గార్గే (Mallika Garge)ని 20 రోజుల్లో ఎందుకు బదిలీ చేశారో సీఎం జగన్ (CM Jagan) సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సోమవారం తిరుపతి (Tirupati)లో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ఎస్పీని బదిలీ చేసి మహిళలందరినీ అవమానపరుస్తున్నారని.. స్థానిక వైసీపీ నేతల (YCP Leaders)ఒత్తిడితోనే ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. ఎస్పీ బదిలీని వెంటనే నిలిపి వేయాలని.. లేని పక్షంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళతామన్నారు.
తిరుపతిలో గంజాయి యథేచ్ఛగా దొరుకుతోందని, తులసీవనం లాంటి తిరుపతిని వైసీపీ నాయకులు గంజాయి వనంగా మార్చారని భానుప్రకాష్ రెడ్డి దుయ్యబట్టారు. గంజాయి సరఫరాలో వైసీపీ నేతల ఒత్తిడి ఉండడం.. ఎస్పీ అరెస్టు చేస్తారన్న భయంతోనే బదిలీ చేయించారని అన్నారు. వైసీపీ బాషలో నిజాయితీకి బహుమానం బదిలీనా..? అని ప్రశ్నించారు. ఇండియన్ పోలీస్ సర్వీస్‌ను ఏపీలో పొలిటికల్ సర్వీస్‌గా వైసీపీ మార్చేసిందని విమర్శించారు. గతంలో దొంగ ఓట్లు వేయించిన వారి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసునని.. బెయిల్‌పై తిరిగే ముఖ్యమంత్రి పరిపాలన ఇలాగే ఉంటుందని భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా సమర్ధవంతంగా విధులు నిర్వహించే అధికారులు వైసీపీ ప్రభుత్వానికి నచ్చబోరని మరోసారి రుజువైంది. తిరుపతి ఎస్పీగా గత నెల 12న బాధ్యతలు స్వీకరించిన మల్లికా గార్గ్ 20 రోజులకే బదిలీ అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చిన ఆమె.. ఆ ఎన్నికల కారణంగానే బదిలీ వేటుకు గురైనట్లు సమాచారం. ఇద్దరు కీలక ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఆమెను తిరుపతి నుంచి పంపించివేసిన జగన్ ప్రభుత్వం.. ఆమెను సీఐడీకి బదిలీ చేసింది.
Updated Date - Mar 04 , 2024 | 01:59 PM