స్విమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్, పారా మెడికల్ కోర్సులకు కౌన్సెలింగ్
ABN, Publish Date - Oct 26 , 2024 | 02:05 AM
స్విమ్స్ యునివర్సిటీలో బీఎస్సీ(నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సె్‌స(పారా మెడికల్) కోర్సులకు 4వ విడత, ఫైనల్ ఆఫ్‌లైన్ విధానంతో ఈ నెల 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ర్టారు అపర్ణ బిట్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి(వైద్యం), అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): స్విమ్స్ యునివర్సిటీలో బీఎస్సీ(నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సె్‌స(పారా మెడికల్) కోర్సులకు 4వ విడత, ఫైనల్ ఆఫ్‌లైన్ విధానంతో ఈ నెల 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ర్టారు అపర్ణ బిట్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు పూర్తి ఫీజుతో హాజరు కావాలని కోరారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రిజర్వేషన్ క్యాటగిరీ ప్రకారం ఏపీ ఈఏపీసీఈటి ర్యాంక్ కట్ ఆఫ్‌ను అనుసరించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ల భర్తీ జరుగుతుందని, ఉదయం 8.30 గంటలకు శ్రీపద్మావతి మెడికల్ కళాశాలకు చేరుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు స్విమ్స్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.
Updated Date - Oct 26 , 2024 | 07:07 AM