ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయి కేసులో బీటెక్‌ విద్యార్థి అరెస్టు

ABN, Publish Date - Oct 26 , 2024 | 02:22 AM

గంజాయి విక్రయిస్తున్న బీటెక్‌ విద్యార్థిని శుక్రవారం తిరుపతి రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): గంజాయి విక్రయిస్తున్న బీటెక్‌ విద్యార్థిని శుక్రవారం తిరుపతి రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ చిన్నగోవిందు కథనం మేరకు.... రూరల్‌ మండలం పేరూరు శ్మశాన వాటిక వద్ద ముగ్గురు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు రూరల్‌ పోలీసులకు సమాచారం అందింది. సీఐ చిన్నగోవిందు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి ఆ ముగ్గురు పారిపోవడానికి ప్రయత్నించారు. పేరూరుకు చెందిన బీటెక్‌ విద్యార్థి బండారి చిరంజీవిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 230 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరు పరారయ్యారని సీఐ చెప్పారు.

Updated Date - Oct 26 , 2024 | 07:01 AM